News March 4, 2025
లక్ష్మణరావు 3సార్లు గెలిచి.. ఈసారి ఓడారు.!

గతంలో మూడు సార్లు ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలుపొందిన కేఎస్ లక్ష్మణరావుకు ఈసారి ఓటమి ఎదురైంది. ఈయన 2007, 2009లో కృష్ణ-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందారు. అయితే 2015 ఎన్నికల్లో పోటీ చేసి ఓడారు. తిరిగి 2019ఎన్నికల్లో గెలుపొందగా.. 2025లో ఓడారు. ఈయన గతంలో గుంటూరు హిందు కళాశాలలో లెక్చరర్‌గా పని చేశారు. నిరుద్యోగులకు తరగతులు చెప్తూ పేరుపొందారు. ఉపాధ్యాయుల వివిధ సమస్యలపైన పోరాడారు.
Similar News
News March 4, 2026
పార్వతీపురం: రీజనల్ కోఆర్డినేటర్‌గా బూడి ముత్యాలనాయుడు

శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలకు YCP రీజనల్ కోఆర్డినేటర్‌గా మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు YS.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలిపారు.
News March 4, 2026
గ్రామసభల్లోనే లబ్ధిదారుల వివరాలు: ఉత్తమ్

సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత ఉండాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. గ్రామ సభల్లోనే రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ లబ్ధిదారుల వివరాలను వెల్లడించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. పథకాల అమలులో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని, ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
News March 4, 2026
నాగర్‌కర్నూల్ జిల్లాలో వరుస నేరాలు.. ప్రజల ఆందోళన

NGKL జిల్లాలో వరుసగా జరుగుతున్న నేరాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. <<19213447>>కుమ్మెర<<>> మరువక ముందే, <<19293278>>KGBV<<>> విద్యార్థిని ప్రసవించి బిడ్డను డస్ట్‌బిన్‌లో పడేసిన ఘటన సంచలనం రేపింది. కొల్లాపూర్‌కు చెందిన గర్భిణి మౌనిక భర్త <<19293566>>వేధింపుల<<>> వల్లే మృతి చెందిదని అక్క పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిజినేపల్లి, గౌరారం శివారులో కొల్లాపూర్‌కు చెందిన జగన్ <<19278148>>హత్య<<>>కు గురయ్యాడు.


