News March 4, 2025
పార్వతీపురం: ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 562 మంది గైర్హాజరు

ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 562 గైర్హాజరు అయినట్లు DVEO మంజులా వీణ తెలిపారు. పార్వతీపురం జిల్లావ్యాప్తంగా మంగళవారం 34 పరీక్ష కేంద్రాల్లో 9,437 మంది విద్యార్థులకు గాను 8,875 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. అందులో 6,488 మంది జనరల్ విద్యార్థులకు 6,243 మంది విద్యార్థులు హాజరయ్యారు. 2,949మంది ఒకేషనల్ విద్యార్థులకు గాను 2,632 మంది హాజరయ్యారని పేర్కొన్నారు.
Similar News
News March 23, 2026
ఇందూరులో ‘డబుల్’ చుట్టే రాజకీయం..!

నిజామాబాద్ అర్బన్ పరిధిలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వేలాది మంది పేదలు దరఖాస్తు చేసుకున్నా, లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం ఉందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిర్మాణం పూర్తైన ఇళ్లను వెంటనే కేటాయించాలని ఆందోళనలు మిన్నంటుతున్నాయి. అటు అధికార పక్షం పారదర్శకంగానే ప్రక్రియ సాగుతోందని చెబుతుండగా, క్షేత్రస్థాయిలో అసలైన అర్హులెవరో తేల్చడం అధికారులకు సవాలుగా మారింది.
News March 23, 2026
కరెంట్ అఫైర్స్

* సుదీర్ఘకాలం (8,931 రోజులు) ప్రభుత్వ అధిపతిగా పనిచేసిన వ్యక్తిగా మోదీ
* టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్‌కు నైట్‌హుడ్ పురస్కారం
* థాయ్‌లాండ్ ప్రధాని అనుతిన్ చర్న్‌విరకుల్ తిరిగి ఎన్నిక
* పారిశ్రామిక ప్రగతికి ఊతం ఇచ్చేందుకు ‘భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన (భవ్య) పథకం
* కోకో సాగులో 1, జీడిపప్పు 2, కొబ్బరిలో 4వ స్థానంలో AP
* ప్రపంచంలో అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్. 116వ స్థానంలో భారత్
News March 23, 2026
ఎన్నికల కోసమే సేవలా: మోహన్ భాగవత్

సేవ చేయడం అంటే ఇతరులకు ఉపకారం చేయడం కాదని, అది ఒక బాధ్యత అని RSS చీఫ్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. నిస్వార్థంగా సేవ చేస్తే కల్మషాలు తొలగిపోయి ఆత్మశుద్ధి జరుగుతుందని వివరించారు. కేవలం ఎన్నికల సమయంలోనో లేదా స్వార్థ ప్రయోజనాల కోసమో చేసే పనులు ఎక్కువ కాలం నిలబడవని, కోరికలు తీరగానే అలాంటి వారు సేవను వదిలేస్తారని విమర్శించారు. భయం వల్ల లేదా బలవంతంగా చేసేది కూడా నిజమైన సేవ అనిపించుకోదని పేర్కొన్నారు.


