News March 4, 2025

HYDలో వికారాబాద్ యువతి సూసైడ్ (PHOTO)

image

రాయదుర్గంలో విషాద ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాలు.. వికారాబాద్ జిల్లాకు చెందిన దేవిక(25), సతీశ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. రాయదుర్గంలో కాపురం పెట్టారు. దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఆదివారం మరోసారి వాగ్వాదం పెట్టుకున్నారు. ఈ మనస్తాపంతో దేవిక ఉరివేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News March 17, 2026

రీఫండ్ పేరుతో మోసాలు.. అప్రమత్తంగా ఉండండి: సీపీ

image

రీఫండ్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా సీపీ సాయి చైతన్య సూచించారు. సాయం పేరుతో పంపే ఏపీకే (APK) ఫైల్స్‌ను ఇన్‌స్టాల్ చేయవద్దని, ఓటీపీలను ఎవరికీ చెప్పవద్దని కోరారు. సందేహాస్పద లింక్‌లు, కాల్స్ పట్ల జాగ్రత్త వహించాలని తెలిపారు. ఒకవేళ సైబర్ నేరానికి గురైతే తక్షణమే 1930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

News March 17, 2026

భద్రాద్రి రామయ్య పెళ్లికి భారీగా ఏర్పాట్లు

image

భద్రాచలంలో రూ.2 కోట్లతో చేపట్టిన శ్రీరామనవమి ఏర్పాట్లు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈనెల 19న ఉగాది రోజు బ్రహ్మోత్సవ సందడి ప్రారంభం కానుంది. అదే రోజు ఉదయం CM, గవర్నర్‌ను పెళ్లికి ఆహ్వానించనున్నారు. భక్తులకు వేసవి వేడి లేకుండా తొలిసారిగా కళ్యాణ మండపం వద్ద నీటి తుంపరలు జల్లే ఫాగ్ మిస్టింగ్ ఫ్యాన్స్, ఎక్కడ కూర్చున్నా కళ్యాణం కనిపించేలా LED స్క్రీన్స్ ఏర్పాటు చేశామని EO దామోదర్ Way2Newsతో చెప్పారు.

News March 17, 2026

ఓరల్ సెక్స్‌తో పెరుగుతున్న గొంతు క్యాన్సర్

image

ఇండియాలో గొంతు క్యాన్సర్‌కు పొగ తాగడం, పొగాకు నమలడం ప్రధాన కారణాలు. ఇప్పుడు US, UKలో ఓరల్ సెక్స్‌ ద్వారా అధిక సంఖ్యలో HPV(హ్యూమన్ పాపిలోమా వైరస్) కేసులు నమోదవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. వీటిలో HPV-16, HPV-18 రకాలు గొంతు క్యాన్సర్‌కు దారితీస్తున్నాయంటున్నారు. ఎక్కువ మందితో లైంగిక సంబంధం, HPV వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్ల ఈ క్యాన్సర్లు పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు.