News March 4, 2025
అకౌంట్లోకి రూ.15,000.. కీలక ప్రకటన

AP: ‘తల్లికి వందనం’ పథకంపై మంత్రి నారా లోకేశ్ శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ఈ పథకం గైడ్‌లైన్స్ విడుదల చేస్తామని ప్రకటించారు. పథకంపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. మే నెలలో ఈ పథకాన్ని ప్రారంభిస్తామని, బడ్జెట్‌లో రూ.9407 కోట్ల కేటాయించినట్లు తెలిపారు. కాగా ఈ పథకం కింద 1-12వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ప్రభుత్వం రూ.15,000 జమ చేయనుంది.
Similar News
News March 4, 2025
ఉర్దూ పాఠశాలల పని వేళలు మార్పు

AP: రంజాన్ మాసంలో రాష్ట్రంలోని ఉర్దూ పాఠశాలల పని వేళలు ఉ.8 నుంచి మ.1.30 వరకు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 3-30 వరకు ఈ మేరకు అనుమతి ఇచ్చినట్లు మంత్రి ఫరూక్ ప్రకటించారు. ఉపాధ్యాయ సంఘాలు, తదితర సంస్థల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు మార్పు చేశామన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేసే ముస్లిం ఉద్యోగులు సాయంత్రం ఓ గంట ముందే వెళ్లేందుకు గత నెల అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే.
News March 4, 2025
MLC కౌంటింగ్: 4,320 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి

TG: ఆదిలాబాద్-నిజామాబాద్-కరీంనగర్-మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మూడో రౌండ్ ముగిసేసరికి 4,320 లీడ్ సాధించారు. ఇప్పటివరకు అంజిరెడ్డికి 23,246, నరేందర్ రెడ్డికి (కాంగ్రెస్) 18,296, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 15,740 ఓట్లు వచ్చాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
News March 4, 2025
ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డులు

TG: కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది. కార్డు నమూనాను సీఎం రేవంత్ ఫైనల్ చేశారు. లేత నీలి రంగులోని కార్డుపై సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ఫొటోలు ఉంటాయి.