News March 4, 2025
“నాటు”ని బీట్ చేసేలా ఎన్టీఆర్-హృతిక్ డాన్స్?

వార్-2 మేకర్స్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఎన్టీఆర్-హృతిక్ రోషన్‌లతో ఒక భారీ సాంగ్ షూటింగ్ ఇవాళ్టి నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వీరిద్దరి స్టెప్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయన్నారు. క్లైమాక్స్ ఫైట్‌కు ముందు వచ్చే ఈ పాటని 500 మందితో డ్యాన్సర్లతో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ప్రీతమ్ మ్యూజిక్ అందించగా బాస్కో మార్టిస్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఇందులో యంగ్ టైగర్ ‘RAW’ ఏజెంట్‌గా నటిస్తున్నారు.
Similar News
News March 4, 2025
ఉర్దూ పాఠశాలల పని వేళలు మార్పు

AP: రంజాన్ మాసంలో రాష్ట్రంలోని ఉర్దూ పాఠశాలల పని వేళలు ఉ.8 నుంచి మ.1.30 వరకు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 3-30 వరకు ఈ మేరకు అనుమతి ఇచ్చినట్లు మంత్రి ఫరూక్ ప్రకటించారు. ఉపాధ్యాయ సంఘాలు, తదితర సంస్థల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు మార్పు చేశామన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేసే ముస్లిం ఉద్యోగులు సాయంత్రం ఓ గంట ముందే వెళ్లేందుకు గత నెల అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే.
News March 4, 2025
MLC కౌంటింగ్: 4,320 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి

TG: ఆదిలాబాద్-నిజామాబాద్-కరీంనగర్-మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మూడో రౌండ్ ముగిసేసరికి 4,320 లీడ్ సాధించారు. ఇప్పటివరకు అంజిరెడ్డికి 23,246, నరేందర్ రెడ్డికి (కాంగ్రెస్) 18,296, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 15,740 ఓట్లు వచ్చాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
News March 4, 2025
ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డులు

TG: కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది. కార్డు నమూనాను సీఎం రేవంత్ ఫైనల్ చేశారు. లేత నీలి రంగులోని కార్డుపై సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ఫొటోలు ఉంటాయి.