News March 4, 2025

మేలో ‘ఎల్లమ్మ’ షూటింగ్!

image

‘బలగం’తో భారీ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ వేణు తెరకెక్కించే కొత్త సినిమా ‘ఎల్లమ్మ’ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. నితిన్ హీరోగా తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ మే నెలలో ప్రారంభం కానున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించిన వేణు.. తాజాగా మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం ముంబైకి వెళ్లారు. మ్యూజిక్ డైరెక్టర్లు అజయ్-అతుల్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Similar News

News March 4, 2025

ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డులు

image

TG: కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది. కార్డు నమూనాను సీఎం రేవంత్ ఫైనల్ చేశారు. లేత నీలి రంగులోని కార్డుపై సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ఫొటోలు ఉంటాయి.

News March 4, 2025

‘ఆస్కార్’ చిత్రాలు ఏ OTTలో ఉన్నాయంటే?

image

✒ అనోరా- జీ5, జియో హాట్ స్టార్(మార్చి 17 నుంచి)
✒ ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా- నెట్‌ఫ్లిక్స్
✒ డ్యూన్:2 జియో హాట్‌స్టార్
✒ ది సబ్‌స్టాన్స్- అమెజాన్ ప్రైమ్(రెంట్), MUBI
✒ ది బ్రూటలిస్ట్- యాపిల్ టీవీ(రెంట్)
✒ ఎమిలియా పెరెజ్- MUBI, ప్రైమ్(రెంట్)
✒ విక్‌డ్- ప్రైమ్(రెంట్), హాట్‌స్టార్(మార్చి 22 నుంచి)

News March 4, 2025

శాసనసభ సభ్యులకు క్రీడా పోటీలు

image

AP: శాసనసభ సభ్యులకు క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పురుషులకు క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ.. మహిళలకు బ్యాడ్మింటన్, త్రోబాల్, టగ్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహించనున్నారు. చీఫ్ విప్‌లు, విప్‌లకు పేర్లు ఇవ్వాలని స్పీకర్ అయ్యన్న సభలో ప్రకటించారు. ఈ నెల 18,19,20 తేదీల్లో నిర్వహించే పోటీలకు IASలు, హైకోర్టు జడ్జిలను ఆహ్వానించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

error: Content is protected !!