News March 4, 2025
తాడ్వాయి: పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య

తాడ్వాయి మండలం దేమికాలన్ గ్రామానికి చెందిన బంగారు గళ్ల అభిజిత్(24) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. పనిచేయకుండా తిరుగుతున్న అభిజిత్‌ను నానమ్మ పనిచేయాలని చెప్పడంతో మనస్తాపానికి గురైన అభిజిత్ ఈనెల 1న పురుగు మందుతాగాడు. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం కామారెడ్డికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు.
Similar News
News March 4, 2025
GWL: ‘లింగమ్మ బావి సుందరీకరణ చర్యలు చేపట్టాలి’

గద్వాల పట్టణంలోని లింగమ్మ బావి సుందరీకరణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. మంగళవారం అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ ఆర్కిటిక్ శ్రీలేఖతో కలిసి లింగమ్మ బావిని పరిశీలించారు. బావిలోకి దిగేందుకు ఉన్న స్టెప్ లెవెల్‌ను పునరుద్ధరించి, ఎప్పటికీ నీరు ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. బావి చుట్టూ రైలింగ్ ఫినిషింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ను సిద్ధం చేయాలని సూచించారు.
News March 4, 2025
మహిళలను గౌరవించే చోట దేవతలు కొలువై ఉంటారు: సీపీ

మహిళలను గౌరవించే చోట దేవతలు కొలువై ఉంటారని రాచకొండ సీపీ సుధీర్ బాబు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాచకొండ కమిషనరేట్, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నాగోల్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ కమిషనరేట్ విభాగాల పోలీసు మహిళా అధికారులు పాల్గొన్నారు.
News March 4, 2025
ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డులు

TG: కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది. కార్డు నమూనాను సీఎం రేవంత్ ఫైనల్ చేశారు. లేత నీలి రంగులోని కార్డుపై సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ఫొటోలు ఉంటాయి.