News March 4, 2025

కృష్ణా: అప్పుడు వెనక్కి తగ్గారు.. ఇప్పుడు విజయం సాధించారు

image

గత అసెంబ్లీ ఎన్నికలలో తెనాలి నుంచి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పోటీ చేయాలని భావించారు. అయితే జనసేన పార్టీకి టికెట్ కేటాయించడంతో చంద్రబాబు ఆదేశాల మేరకు ఆలపాటి వెనక్కి తగ్గారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటిని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎలాగైనా గెలిచి తీరాలని కసితో ఆలపాటి MLC ఎన్నికలను సవాల్‌గా తీసుకొని పట్టభద్రుల మద్దతుతో అఖండ విజయం సాధించారు.

Similar News

News April 21, 2025

VJA ఆటోనగర్‌ లాడ్జీల్లో తనిఖీలు

image

విజయవాడ ఆటోనగర్‌లోని లాడ్జీల్లో శనివారం అర్ధరాత్రి పటమట పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో భాగంగా పేకాట ఆడుతున్న ఐదుగురిని, వ్యభిచారం చేస్తున్న ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పటమట పోలీసులు తెలిపారు.

News April 21, 2025

కృష్ణా: బాబోయ్ అడ్మిషన్‌లా..? భయపడిపోతున్న ప్రైవేట్ టీచర్స్

image

కృష్ణా జిల్లాలో రాబోయే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూల్ టీచర్లు పరుగులు పెడుతున్నారు. కొన్ని స్కూల్స్‌లో అయితే టార్గెట్లు ఇవ్వడంతో ఒత్తిడికి గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినిమం అడ్మిషన్లు తెస్తేనే జీతాలు ఇస్తామంటూ హుకుం జారీ చేయడంతో మండుటెండల్లో రోడ్ల వెంట పరుగులు పెడుతున్నారు. విద్యా సంవత్సరం మారుతున్న ప్రతిసారి ఇదే పరిస్థితి అంటూ వాపోతున్నారు.

News April 21, 2025

కృష్ణా: ‘నేడు కలెక్టరేట్లో మీకోసం కార్యక్రమం’

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక నేడు(సోమవారం) కలెక్టరేట్‌లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉంటుందన్నారు.

error: Content is protected !!