News March 4, 2025

WNP: జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ 

image

శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా వనపర్తి జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. 30 పోలీస్ యాక్ట్ మార్చి1 నుంచి 31 వరకు అమల్లో ఉన్నందున జిల్లాలో పోలీసు అధికారుల అనుమతులు లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, ఫంక్షన్ హాల్లో కార్యక్రమాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమిగూడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించరాదని చెప్పారు.

Similar News

News March 4, 2025

మన్యం జిల్లా డీఆర్డీఏ పీడీగా సుధారాణి

image

పార్వతీపురం మన్యం జిల్లా డీఆర్డీఏ పీడీగా సుధారాణి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె బాధ్యతలు చేపట్టారు. అనంతరం కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో గ్రామీణ అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ ఆమెకు సూచించారు. డీఆర్డీఏ పరిధిలోని సమస్యలు గుర్తించి.. వాటిని పరిష్కరించేలా అడుగులు వేయాలన్నారు.  

News March 4, 2025

BREAKING: భువనగిరిలో రోడ్డెక్కిన మహిళలు

image

భువనగిరి మండలం హనుమాపురంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని మహిళలు ఆరోపించారు. భువనగిరి-జగదేపూర్ ప్రధాన రహదారిలోని హనుమపురం చౌరస్తా వద్ద మహిళలు బిందెలు పట్టుకొని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పట్టించుకోవాలని కోరారు. మహిళలు రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అధికారులు తాగునీటి ఎద్దడి తీవ్రతను అరికట్టలేకపోతున్నారని వారు మండిపడ్డారు. 

News March 4, 2025

జీడిమెట్ల సీఐకి స్మార్ట్ పోలీసింగ్‌లో స్పెషల్ జ్యూరీ అవార్డు

image

ఢిల్లీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ పోలీసింగ్ అవార్డుకు తెలంగాణ నుంచి స్పెషల్ జ్యూరీ అవార్డును సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జీడిమెట్ల CI మల్లేశ్ అందుకున్నారు. దేశవ్యాప్తంగా 129 రాష్ట్రాల పోలీస్ విభాగాలతో పాటు సెంట్రల్ పోలీస్ ఫోర్స్ నుంచి కూడా పోటీపడ్డారు. అనంతరం తెలంగాణ డీజీపీకి శుభాకాంక్షలు తెలిపారు.

error: Content is protected !!