News March 4, 2025

WGL: పెరిగిన మొక్కజొన్న, తగ్గిన పల్లికాయ ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఈరోజు చిరుధాన్యాలు తరలివచ్చాయి. ఈ క్రమంలో మొక్కజొన్న, పల్లికాయ ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు(బిల్టి) క్వింటాకు సోమవారం రూ.2,355 పలకగా.. నేడు రూ.2,360కి పెరిగింది. అలాగే పచ్చి పల్లికాయ క్వింటాకి నిన్న రూ.5,500 ధర రాగా.. నేడు రూ.5,600 పలికింది. సూక పల్లికాయకి నిన్న రూ.7,500 ధర, నేడు రూ.6900కి పడిపోయింది.

Similar News

News March 22, 2026

వరంగల్ జిల్లాలో మాంసం ప్రియులకు షాక్!

image

వరంగల్ జిల్లాలో మాంసంప్రియులకు షాక్ తగిలింది. ఆదివారం చికెన్ ధరలు భారీ ధర పలికాయి. విత్ స్కిన్ కేజీ రూ.310-320 ఉండగా, స్కిన్‌లెస్ ధర రూ.340-350 వరకు పలుకుతోంది. లైవ్ కోడి కేజీ రూ.210-230 మధ్య విక్రయిస్తున్నారు. కాగా, నగరంతో పోలిస్తే పల్లెల్లో రూ.10-20 ధర వ్యత్యాసం ఉంది. పెరిగిన నిత్యవసర సరుకుల ధరలు, కోళ్ల సప్లై తక్కువ ఉండడంతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

News March 21, 2026

మొక్కజొన్నకు రూ.2,400 మద్దతు ధర: కలెక్టర్

image

మొక్కజొన్నకు క్వింటాకు రూ.2,400 మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ సత్య శారద తెలిపారు. రైతులు పంటను విక్రయించేటప్పుడు తేమ శాతం (మాయిశ్చర్) 14 లోపు ఉండేలా చూసుకోవాలని సూచించారు. రైతులు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని, నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని కోరారు. రైతుల ఖాతాల్లో సకాలంలో డబ్బులు జమ అయ్యేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు.

News March 21, 2026

WGL: నాలుగు మండలాల్లోనే వర్షం

image

వరంగల్ జిల్లాలో శుక్రవారం కురిసిన వర్షపాతం సగటున 0.9 మిల్లీమీటర్లు నమోదుకగా, జిల్లా వ్యాప్తంగా 4.9 మిల్లీమీటర్లు వర్ష పాతం నమోదైంది. జిల్లాలోని 13 మండలాల్లో సంగేంలో 1.8 మిల్లీమీటర్లు, కిలా వరంగల్‌లో 1.5 మిల్లీమీటర్లు, వరంగల్‌లో 0.8 మిల్లీమీటర్లు, గీసుకొండలో 0.8 మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదుకగా, మిగిలిన 9 మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు.