News March 4, 2025

మెదక్: చెల్లని ఓట్లతో అభ్యర్థుల్లో ఆందోళన !

image

కరీంనగర్‌లో పట్టభద్రుల MLCఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నిన్నటి నుంచి చెల్లిన, చెల్లని ఓట్లు వేరు చేసి తాజాగా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. హోరాహోరీగా సాగిన పోలింగ్‌లో తొలి ప్రాధాన్య ఓట్లతో గెలుపు కష్టమేనని పలువురు అంటున్నారు. చెల్లని ఓట్లు అధికంగా కనిపించడం అభ్యర్థులను ఆందోళనకు గురిచేసింది. ఈ ఓట్లతో ఫలితాలు తారుమారయ్యే ఛాన్స్ ఉందని, ఎవరికి నష్టం కలిగిస్తాయో అన్న టెన్షన్‌ మొదలైంది.

Similar News

News March 4, 2025

మెదక్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ.. 24 ఓట్ల ఆధిక్యంలో అంజిరెడ్డి

image

కరీంనగర్‌లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఫస్ట్ రౌండ్‌లో బీజేపీ అంజిరెడ్డి 24 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 6697 ఓట్లు పోల్ కాగా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 6673, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 5897 ఓట్లు పోలయ్యాయి. తన సమీప అభ్యర్థి నరేందర్ రెడ్డిపై 24 ఓట్ల లీడ్‌లో అంజిరెడ్డి ముందంజలో ఉన్నారు.

News March 4, 2025

మెదక్: లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా పీసీపీఎన్ డీటీ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ శ్రీరామ్ తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఆడపిల్లల బ్రాణ హత్యలు, లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్ చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లావ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ కోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇచ్చారు.

News March 4, 2025

టెన్త్ విద్యార్థులకు OMRపై అవగాహన కల్పించాలి: డీఈవో

image

ఈ నెలలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఈ నెల 6 నుంచి ప్రారంభమయ్యే ప్రి ఫైనల్ పరీక్షలో పదో తరగతి విద్యార్థులకు ఓఎంఆర్ పత్రాల్లో సమాచారంపై అవగాహన కల్పించాలని మెదక్ డీఈవో రాధా కిషన్ తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. ఓఎంఆర్ పత్రాలను సంబంధిత మండల వనరుల కార్యాలయం నుంచి తీసుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సూచించారు.

error: Content is protected !!