News March 4, 2025

PPM: 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఈ నెల 8వ తేదీన ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఛాంబరులో మహిళా దినోత్సవ వేడుకలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఆనాటికి ఎన్నికల కోడ్ ముగిసే అవకాశం ఉన్నందున మహిళా దినోత్సవ వేడుకలకు ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని అన్నారు.

Similar News

News March 4, 2026

శ్రీకాకుళం: పాలిటెక్నిక్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

పాలిటెక్నిక్ డిప్లమా ప్రవేశాల పరీక్ష పాలిసెట్-2026కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శ్రీకాకుళం పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్, కన్వీనర్ నారాయణరావు బుధవారం తెలిపారు. ప్రవేశ పరీక్షకు పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు అర్హులుగా చెప్పారు. https://polycetap.ap.gov. ఇన్ వెబ్సైట్లో ఏప్రిల్ 4లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పది కళాశాలలు ఉన్నాయన్నారు.

News March 4, 2026

WGL: రూ.680 కోట్ల పెండింగ్.. ‘సర్టిఫికెట్’ చిక్కులు!

image

ఉమ్మడి జిల్లాలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. మూడు విద్యా సంవత్సరాలకు సంబంధించి సుమారు రూ.570 కోట్ల నిధులు పెండింగ్‌లో ఉండగా, ప్రస్తుత ఏడాదితో కలిపి ఆ మొత్తం రూ.680 కోట్లకు చేరనుంది. ఫలితంగా కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను పట్టుకుని కూర్చున్నాయి. జిల్లాలో సుమారు లక్ష మంది విద్యార్థులు, అందులోనూ సగం మంది బీసీలే ఉండటం గమనార్హం.

News March 4, 2026

మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంపై దాడి.. నిందితుడికి రిమాండ్

image

మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇటీవల 2 కార్లను ధ్వంసం చేయడంతో పాటు భద్రతా సిబ్బందిపై దాడిచేసిన వ్యక్తిని మంగళవారం రిమాండ్‌కి పంపినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. పార్టీ కార్యాలయ భద్రతా సిబ్బంది RI పెంటారావు ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన నీలాద్రిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి మంగళగిరి కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించారు.