News March 4, 2025
మద్య నిషేధం ఉన్నప్పటికీ 4 సెకండ్లకో బాటిల్ సీజ్!

గుజరాత్‌లో మద్య నిషేధ చట్టం అమలవుతున్న విషయం తెలిసిందే. అక్కడ ఆల్కహాల్ అమ్మినా, కొనుగోలు చేసినా నేరమే. కానీ, అక్కడ ప్రతి 4 సెకండ్లకు ఓ లిక్కర్ బాటిల్ సీజ్ అవుతోంది. 2024లో రూ.144 కోట్లు విలువ చేసే దాదాపు 82 లక్షల బాటిళ్లను సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అహ్మదాబాద్ సిటీ & రూరల్‌లోనే 4.38 లక్షల బాటిళ్లు సీజ్ అయ్యాయి. వినూత్నంగా స్మగ్లింగ్ చేస్తున్నప్పటికీ పోలీసులు వారిని గుర్తిస్తున్నారు.
Similar News
News March 13, 2026
ఉగాది ఎప్పుడు? ఆరోజు ఏం చేయాలి?

ఈ ఏడాది మార్చి 19న ఉగాది జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ‘ఆ రోజున 3:45 AM – 5:30 AM మధ్య నిద్రలేవడం శ్రేయస్కరం. నువ్వుల నూనెతో స్నానం చేసి, నూతన వస్త్రాలు ధరించాలి. ఇంటిని మామిడి తోరణాలు, ముగ్గులతోనే కాకుండా వేప కొమ్మలతోనూ అలంకరించడం మంచిది. షడ్రుచుల పచ్చడిని తప్పక తాగాలి. ఇది ప్రకృతి ఇచ్చే కష్టసుఖాలను సమానంగా స్వీకరించే శక్తిని ఇస్తుంది. పంచాంగ శ్రవణంతో రాశిఫలాలు తెలుసుకోవాలి’ అంటున్నారు.
News March 13, 2026
ఎల్లుండి దానధర్మాలు చేస్తే?

MAR 15న సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. దీన్నే మీన సంక్రాంతి అంటారు. ఈ పవిత్రమైన రోజున జపాలు, పుణ్యస్నానాలు ఆచరించాలని పండితులు సూచిస్తున్నారు. ‘గత జన్మ పాపాల నుంచి విముక్తికై ఈరోజు సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. లక్ష్మీనృసింహస్వామికి పాయసం నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున చేసే దానధర్మాలకు విశేష పుణ్యఫలం ఉంటుంది. ఇతరుల శ్రేయస్సు కోరి చేసే ఈ పనులతో కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయి’ అంటున్నారు.
News March 13, 2026
ఏపీ జెన్‌కో ALL TIME RECORD.. సీఎం అభినందన

ఏపీ జెన్‌కో ఈ నెల 11న 6,160 మెగా వాట్ల థర్మల్ విద్యుదుత్పత్తి చేయడం ద్వారా ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. ఇందులో భాగస్వాములైన ఉద్యోగులు, సిబ్బందికి CM చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ప్రాజెక్టుల గరిష్ఠ సామర్థ్యం 6,610 మెగా వాట్లు కాగా 93.19% ఉత్పత్తి సాధించడం గొప్ప విషయమన్నారు. కూటమి ప్రభుత్వ 20 నెలల పాలనలో విద్యుత్ రంగం పుంజుకుని వెలుగులు విరజిమ్ముతోంది అనేందుకు ఈ ఘనత సాక్ష్యమని తెలిపారు.


