News March 4, 2025
అయోధ్యే కాదు కుంభమేళా పైనా ఉగ్రదాడికి కుట్ర!

అయోధ్య రామమందిరంపై దాడికి ప్లాన్ చేసిన టెర్రరిస్టు <<15639611>>అబ్దుల్<<>> రెహ్మాన్ అరెస్టు చేయడం ద్వారా ATS, STF భారీ కుట్రల్నే భగ్నం చేశాయి. అతడు ISISలోని ISKP మాడ్యూల్‌కు చెందినవాడిగా తెలిసింది. 18 నెలల క్రితం నెట్‌వర్క్‌లో చేరి ఆన్‌లైన్, వీడియోకాల్స్ ద్వారా ట్రైనింగ్ తీసుకున్నాడు. రామ మందిరంపై దాడికి ఆదేశాలు పొందాడు. ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో లోన్ ఊల్ఫ్ అటాక్ చేసేందుకూ సిద్ధపడ్డాడని సమాచారం.
Similar News
News March 4, 2025
కోహ్లీ హాఫ్ సెంచరీ, అయ్యర్ ఔట్

ఛాంపియన్స్ ట్రోఫీ: ఆస్ట్రేలియాతో సెమీఫైనల్లో భారత్ మరో వికెట్ కోల్పోయింది. రోహిత్, గిల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, అయ్యర్ నిలకడగా ఆడారు. ఈ క్రమంలో కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా, అయ్యర్ 45 పరుగుల వద్ద ఔటయ్యారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 27 ఓవర్లలో 136/3గా ఉంది. భారత్ విజయానికి మరో 23 ఓవర్లలో 129 పరుగులు కావాలి. కోహ్లీ (51*), అక్షర్ పటేల్ (2*) క్రీజులో ఉన్నారు.
News March 4, 2025
ఇంటర్ పరీక్షలు రాసేవారికి అలర్ట్

TG: రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉ.9 నుంచి మ.12 వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. తప్పనిసరి పరిస్థితుల్లో 5 ని.లు ఆలస్యమైనా అనుమతిస్తామని అధికారులు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల అడ్రస్ విషయంలో గందరగోళానికి గురికాకుండా హాల్‌టికెట్లపై QR కోడ్ ముద్రించామని తెలిపారు. ఏవైనా సమస్యలు ఉంటే 9240205555కు కాల్ చేయాలని సూచించారు. 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
*ALL THE BEST STUDENTS
News March 4, 2025
రెడ్ బుక్ తన పని చేసుకుంటూ వెళ్తోంది: లోకేశ్

TDP కార్యకర్తలు, ప్రజలను ఇబ్బంది పెట్టిన ఎవ్వరినీ వదలబోమని మంత్రి లోకేశ్ హెచ్చరించారు. ఎక్కడికి వెళ్లినా తనను రెడ్ బుక్ గురించి అడుగుతున్నారని, రెడ్ బుక్ తన పని అది చేసుకుంటూ వెళ్తోందన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టనని గతంలోనే తాను చెప్పినట్లు వెల్లడించారు. ఎవరినైనా వదిలిపెడతాననే డౌట్ అక్కర్లేదన్నారు. దేశంలోనే ఏ పార్టీకి లేని బలం TDPకి ఉందని, కార్యకర్తలే పార్టీకి బలమన్నారు.