News March 4, 2025
KNR: MLC ఎలక్షన్స్.. 24 ఓట్ల ఆధిక్యంలో BJP

కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఫస్ట్ రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 6,697 ఓట్లు పోలయ్యాయి. కాగా కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డికి 6,673, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 5,897 ఓట్లు పోలయ్యాయి. తన సమీప అభ్యర్థి నరేందర్ రెడ్డిపై 24 ఓట్ల లీడ్‌లో అంజిరెడ్డి ముందంజలో ఉన్నారు.
Similar News
News March 4, 2026
రాజమండ్రిలో విద్యుత్ ఘాతానికి గురైన విద్యార్థులు

రాజమండ్రి అనుశ్రీ థియేటర్ వద్ద ట్రైనింగ్ కాలేజీ ప్రాంగణంలో ఉన్న స్కూల్‌లో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు బుధవారం విద్యుత్ ఘాతానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ భరత్ రామ్ విద్యార్థులను పరామర్శించారు. 15వ వార్డు చెందిన యన్.రమేశ్, 27వ వార్డు చెందిన ఉజ్వల ఈశ్వర సాయిలు మామిడికాయలు కోయడానికి వెళ్లే ప్రయత్నంలో విద్యుత్ ఘాతానికి గురయ్యారు. అధికారులు స్పందించాలని భరత్ కోరారు.
News March 4, 2026
మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటు?

మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగిపోతున్నట్లు సమాచారం. ఢిల్లీ వెళ్లిన TG CM రేవంత్ ఎదుట లొంగిపోనుండగా కేంద్రానికి ఆయనను CM అప్పగిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సారంగపూర్ (జగిత్యాల) వాసి గణపతి దశాబ్దాలుగా ఉద్యమంలో ఉన్నారు. అడవి పార్టీలన్నీ ఒకటై మావోయిస్టు పార్టీగా ఏర్పడ్డాక ఈయన తొలి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. కొంతకాలంగా ఈయన నేపాల్‌లో ఉన్నట్లు ప్రచారం జరిగింది.
News March 4, 2026
కొమురవెల్లి కేజీబీవీ భోజనంపై కలెక్టర్ ఆగ్రహం

కొమురవెల్లి మండలంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని(KGBV) కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఆమె.. బగారా అన్నం రుచికరంగా లేకపోవడం, కూరలు పల్చగా ఉండటంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థుల ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని సిబ్బందిని ఆదేశించారు.


