News March 4, 2025
ADB: MLC ఎలక్షన్స్.. 24 ఓట్ల ఆధిక్యంలో BJP

ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్-కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఫస్ట్ రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 6,697 ఓట్లు పోలయ్యాయి. కాగా కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డికి 6,673, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 5,897 ఓట్లు పోలయ్యాయి. తన సమీప అభ్యర్థి నరేందర్ రెడ్డిపై 24 ఓట్ల లీడ్‌లో అంజిరెడ్డి ముందంజలో ఉన్నారు.
Similar News
News March 4, 2025
సర్వేలు త్వరగా పూర్తి చేయండి: జేసీ

అల్లూరి జిల్లాలో జరుగుతున్న అన్ని రకాల సర్వేలను నిర్దేశిత సమయంలో పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఐటీడీఏ పీవోలు, 22 మండలాల ఎంపీడీవోలతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఎంఎస్ఎంఈ, మిస్సింగ్ సిటిజన్స్, ఆధార్ నమోదు లేని పిల్లలు, జనన మరణాల ఆలస్య నమోదు, స్కూల్ టాయిలెట్ తనిఖీ, వర్క్ ఫ్రమ్ హోం, పీ4, తదితర సర్వేలు వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు.
News March 4, 2025
HYD: ఈనెల 6న తెలంగాణ మంత్రివర్గ సమావేశం

బడ్జెట్ సమావేశాలు దగ్గర పడుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. అందుకోసం ఈనెల 6న కేబినెట్ మీటింగ్ నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం ఈ సమావేశం జరగనుంది. కాగా ఈ సమావేశంలో ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ అంశాలను చర్చించనున్నారు.
News March 4, 2025
ఆ ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకోండి: సుప్రీం

సామాన్యులకు వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయని సుప్రీంకోర్టు మండిపడింది. ఇది ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరేలా పరోక్షంగా ప్రేరేపించడమే అని పేర్కొంది. తమ ఫార్మసీలోనే మెడిసిన్ కొనాలనే ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై దాఖలైన పిల్‌పై విచారణ జరిపిన సుప్రీం ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బిహార్, TN, HP, రాజస్థాన్‌లకు నోటీసులు జారీచేసింది.