News March 4, 2025
ADB: MLC ఎలక్షన్స్.. 24 ఓట్ల ఆధిక్యంలో BJP

ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్-కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఫస్ట్ రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 6,697 ఓట్లు పోలయ్యాయి. కాగా కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డికి 6,673, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 5,897 ఓట్లు పోలయ్యాయి. తన సమీప అభ్యర్థి నరేందర్ రెడ్డిపై 24 ఓట్ల లీడ్‌లో అంజిరెడ్డి ముందంజలో ఉన్నారు.
Similar News
News March 17, 2026
జగిత్యాల: కలిసి పని చేస్తామన్న ఎమ్మెల్యే.. సాధ్యమేనా?

జగిత్యాల రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ మార్పుపై చర్చలు కొనసాగుతుండగా, స్థానిక MLA స్పందన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. జీవన్ రెడ్డితో కలిసి పనిచేయడానికి సిద్ధమని ఎమ్మెల్యే చెప్పినా, ఇరువురి మధ్య గతంలో ఉన్న విభేదాలు, వర్గపోరు నేపథ్యంలో ఇది ఎంతవరకు సాధ్యమన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవైపు జీవన్ రెడ్డి పార్టీ మారేందుకు సన్నద్ధమయ్యారు.
News March 17, 2026
20 లక్షల ఉద్యోగాలే టార్గెట్: లోకేశ్

AP: పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. మంగళగిరిలో ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు(APEDB) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన.. ఉద్యోగాల కల్పనే సింగిల్ అజెండాగా ఉండాలన్నారు. ఒప్పందాలు కాకుండా పెట్టుబడులు కార్యరూపం దాల్చేలా కృషి చేయాలని ఆదేశించారు.
News March 17, 2026
ఏప్రిల్ 15 వరకు పశువులకు గాలికుంటు టీకాలు: జేసీ

2030 నాటికి గాలికుంటు వ్యాధిని పూర్తిగా నియంత్రించడమే లక్ష్యమని జేసీ నిశాంతి తెలిపారు. మంగళవారం అమలాపురం కలెక్టరేట్‌లో టీకా కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 15 వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఏడాదికి రెండుసార్లు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలని పాడి రైతులకు సూచించారు. జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకం కింద ఈ టీకాలు వేయనున్నారు.


