News March 4, 2025

మెదక్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ.. 24 ఓట్ల ఆధిక్యంలో అంజిరెడ్డి

image

కరీంనగర్‌లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఫస్ట్ రౌండ్‌లో బీజేపీ అంజిరెడ్డి 24 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 6697 ఓట్లు పోల్ కాగా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 6673, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 5897 ఓట్లు పోలయ్యాయి. తన సమీప అభ్యర్థి నరేందర్ రెడ్డిపై 24 ఓట్ల లీడ్‌లో అంజిరెడ్డి ముందంజలో ఉన్నారు.

Similar News

News September 15, 2025

వనపర్తి: మూడు వైద్య అధికారి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

వనపర్తి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో మూడు వైద్య అధికారి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీనివాసులు ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 19వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తుతో పాటు జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.300 చొప్పున జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం, వనపర్తి పేరు మీద డీడీ తీసి జత చేయాలని ఆయన సూచించారు.

News September 15, 2025

అంతర పంటల సాగుతో ఆర్థికాభివృద్ధి: భద్రాద్రి కలెక్టర్

image

అంతర పంటల సాగుతో రైతులు ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ములకలపల్లి మండలం ముకమామిడి గ్రామపంచాయతీ పరిధిలోని గట్టగూడెం గ్రామంలో సోమవారం ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన వెదురు సాగును కలెక్టర్ ప్రారంభించి, మాట్లాడారు. ప్రతి రైతు సాంప్రదాయ పంటలతో పాటు కొత్త పంటలను ప్రయత్నించాలన్నారు. అంతర పంటల సాగు ద్వారా తక్కువ భూమిలో ఎక్కువ లాభాలు పొందవచ్చునని అన్నారు.

News September 15, 2025

రేపు భారత్-అమెరికా వాణిజ్య చర్చలు

image

భారత్, అమెరికా మధ్య రేపు వాణిజ్య చర్చలు జరగనున్నాయి. ఇందుకోసం ఇవాళ రాత్రి US చీఫ్ నెగోషియేటర్, ట్రంప్ సహాయకుడు బ్రెండన్ లించ్ భారత్ చేరుకోనున్నారు. ట్రేడ్ డీల్‌‌పై పరస్పరం చర్చలకు ఎదురుచూస్తున్నట్లు ట్రంప్‌తో పాటు ప్రధాని మోదీ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే.