News March 4, 2025
KNR: MLC ఎలక్షన్స్.. 24 ఓట్ల ఆధిక్యంలో BJP

కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఫస్ట్ రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 6,697 ఓట్లు పోలయ్యాయి. కాగా కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డికి 6,673, బీఎస్పీ అభ్యర్ధి ప్రసన్న హరికృష్ణకు 5,897 ఓట్లు పోలయ్యాయి. తన సమీప అభ్యర్ధి నరేందర్ రెడ్డిపై 24 ఓట్ల లీడ్‌లో అంజిరెడ్డి ముందంజలో ఉన్నారు.
Similar News
News September 13, 2025
పల్నాడులో విష జ్వరాల విజృంభణ.. ఐదేళ్ల చిన్నారి మృతి

వాతావరణంలో మార్పుల కారణంగా పల్నాడు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారు. ముందుగా జలుబు, దగ్గుతో ప్రారంభమై క్రమంగా జ్వరంగా మారుతుందని, చాలా మంది గొంతు నొప్పితో బాధపడుతున్నారని తెలిపారు. క్రోసూరు మండలం ఆవులవారిపాలెంలో ఐదేళ్ల చిన్నారి నాగలక్ష్మీ విష జ్వరంతో మృతి చెందడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. దీనిపై వైద్య అధికారులు వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
News September 13, 2025
పెనుకొండలో భార్యను హత్య చేసిన భర్త

పెనుకొండలో భార్యను భర్త హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. అల్తాఫ్ ఖాన్ తన భార్య సుమియా భాను(27)ను పుట్టింటి నుంచి డబ్బు తీసుకురావాలని గొడవపడేవాడు. దీనిపై కేసు నమోదైంది. అప్పట్నుంచి పిల్లలతో పుట్టింటిలోనే ఉంటోంది. ఆగస్టు 26న పిల్లలను, ఆమెను తన గదికి తీసుకెళ్లి అల్తాఫ్ దారుణంగా కొట్టాడు. తీవ్రగాయాలైన సుమియాను కుటుంబీకులు హిందూపురం ఆస్పత్రికి తరలించారు. అనంతరం బెంగళూరు తీసుకెళ్లగా శుక్రవారం మృతిచెందింది.
News September 13, 2025
ఈనెల 14న ఎన్డీఏ, సీడీఎస్ పరీక్షలు: డీఆర్ఓ

UPSC ఆధ్వర్యంలో ఈనెల 14న నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ పరీక్షలు జరుగుతాయని DRO మాలోలా తెలిపారు. రెండు కేంద్రాలలో 252 మంది అభ్యర్థులు హాజరవుతారు. UPSC నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు పగడ్బందీగా నిర్వహిస్తామన్నారు. JNTU, KSN ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలల్లో పరీక్షలు జరుగుతాయన్నారు.