News March 4, 2025
నవోదయం 2.0పై విస్తృతంగా అవగాహన

నవోదయం 2.0పై విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్‌లో ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నవోదయం 2.0 కార్యక్రమానికి సంబంధించిన కళాజాత ప్రచార వాహనాన్ని జిల్లా కలెక్టర్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. నాటు సారాను నిర్మూలించడానికి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని, నవోదయం 2.0పై నెల రోజులపాటు కళాజాత ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు.
Similar News
News March 10, 2026
అనంత: ఉద్యోగుల సీనియారిటీ లిస్టులో తప్పులు..!

స్వర్ణ వార్డ్ సచివాలయ ఉద్యోగుల సీనియారిటీ లిస్ట్‌లో తప్పులు ఉన్నట్లు రిజర్వేషన్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాయలసీమ అధ్యక్షుడు ఆదినారాయణ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్లో PGRS కార్యక్రమంలో సచివాలయం ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా అధికారులకు వారు వినతి ఇచ్చారు. సీనియార్టీ లిస్టును సరిదిద్ది రిజర్వేషన్ ఎంప్లాయీస్‌కి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని కోరారు.
News March 9, 2026
అనంత: YCP సోషల్ మీడియా కన్వీనర్ అరెస్ట్

ITDP నాయకురాలు జె.రేణుక మీద సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన అనంతపురం (D) మద్దెలచెరువుకు చెందిన YCP సోషల్ మీడియా కన్వీనర్ మదిగుబ్బ అశోక్‌ను తెనాలి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. TTD ఛైర్మన్ BR నాయుడు వ్యవహారంలో రేణుక మీద సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన అశోక్‌ను అరెస్ట్ చేసినట్లు CI నాయబ్ రసూల్ తెలిపారు. నిందితుడు సయ్యద్‌ను ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి విధితమే.
News March 9, 2026
మాజీ ఎంపీ తలారి రంగయ్యకు ప్రాణహాని: నారాయణ

కళ్యాణదుర్గం ఈ-స్టాంప్ కుంభకోణంపై హైకోర్టులో పోరాడుతున్న మాజీ ఎంపీ డా. తలారి రంగయ్యకు ప్రాణహాని ఉందని YCP నాయకులు నారాయణ, తిమ్మరాయుడు తెలిపారు. తక్షణమే ఆయనకు 2+2 పోలీసు భద్రత కల్పించాలని సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. స్కామ్ బాధ్యుల నుంచి రంగయ్యకు ముప్పు ఉందని ఆరోపించారు.


