News March 4, 2025

బండ్లమ్మ సేవలో బాపట్ల కలెక్టర్

image

పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని శ్రీ భగలాముఖి అమ్మవారి ఆలయంలో బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ నిర్వహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం చందోలు బండ్లమ్మ తల్లిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.

Similar News

News March 4, 2025

15 కేజీల బంగారంతో పట్టుబడ్డ నటి

image

బంగారం స్మగ్లింగ్ చేస్తూ కన్నడ నటి రాన్యా రావ్ DRI అధికారులకు పట్టుబడ్డారు. రాన్య 15రోజుల్లో 4సార్లు దుబాయ్ వెళ్లి రావడంతో అధికారులు నిఘా పెట్టారు. నిన్న రాత్రి దుబాయ్ నుంచి బెంగళూరు రాగానే ఆమెను విచారించారు. రాన్య వద్ద 15 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకుని, ఆమెను అరెస్టు చేశారు. గోల్డ్ బిస్కెట్లను దుస్తుల్లో దాచి తీసుకొస్తున్నారని తెలిపారు. తాను మాజీ DGP రామచంద్రరావు కూతురినని ఆమె చెప్పారన్నారు.

News March 4, 2025

GWL: ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్

image

రేపటి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు మూసివేయాలని, ఆ పరిసరాల్లో లౌడ్ స్పీకర్లు వినియోగించరాదని సూచించారు. 500 మీటర్ల వరకు ప్రజలు గుమికూడ రాదన్నారు.

News March 4, 2025

నల్గొండ: నీట్ పరీక్షకు కలెక్టర్ కసరత్తు

image

మే 4న నిర్వహించనున్న నీట్ ప్రవేశ పరీక్షకు పరీక్ష కేంద్రాల ఏర్పాటు విషయమై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలలను పరిశీలించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని చర్లపల్లి వద్ద ఉన్న విపస్య పాఠశాల, అలాగే మీర్‌బాగ్ కాలనీలో ఉన్న నల్గొండ పబ్లిక్ పాఠశాలల్లో నీట్ పరీక్ష కేంద్రాల ఏర్పాటుకై మౌలిక వసతులను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.

error: Content is protected !!