News March 4, 2025
సజ్జల బెయిల్ పిటిషన్.. విచారణ వాయిదా

AP: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. వివరాలు సమర్పించేందుకు ప్రభుత్వం సమయం కోరడంతో తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. పోసాని రిమాండ్ రిపోర్టు ఆధారంగా కేసు నమోదయ్యే అవకాశం ఉందంటూ బెయిల్ కోసం ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే.
Similar News
News March 4, 2025
శ్రీవారి ఆలయాలకు ఫ్రీగా స్థలం కేటాయించండి: TTD ఛైర్మన్

AP: దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయం నిర్మాణానికి ఉచితంగా స్థలం కేటాయించాలని TTD ఛైర్మన్ BR నాయుడు కోరారు. CM చంద్రబాబు ఆదేశాలతో ఈ మేరకు పలు రాష్ట్రాల CMలకు లేఖలు రాశారు. దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదని, సమాజ అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం ముఖ్యమన్నారు. మన సంస్కృతి, వారసత్వ పరిరక్షణకు ఆలయాలది కీలక పాత్ర అని చెప్పారు.
News March 4, 2025
15 కేజీల బంగారంతో పట్టుబడ్డ నటి

బంగారం స్మగ్లింగ్ చేస్తూ కన్నడ నటి రాన్యా రావ్ DRI అధికారులకు పట్టుబడ్డారు. రాన్య 15రోజుల్లో 4సార్లు దుబాయ్ వెళ్లి రావడంతో అధికారులు నిఘా పెట్టారు. నిన్న రాత్రి దుబాయ్ నుంచి బెంగళూరు రాగానే ఆమెను విచారించారు. రాన్య వద్ద 15 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకుని, ఆమెను అరెస్టు చేశారు. గోల్డ్ బిస్కెట్లను దుస్తుల్లో దాచి తీసుకొస్తున్నారని తెలిపారు. తాను మాజీ DGP రామచంద్రరావు కూతురినని ఆమె చెప్పారన్నారు.
News March 4, 2025
బనకచర్లపై రాజకీయం చేస్తున్నారు: చంద్రబాబు

బనకచర్ల ప్రాజెక్టుకు TG ప్రభుత్వం అడ్డు <<15640378>>చెప్పడంపై<<>> AP CM చంద్రబాబు స్పందించారు. ‘గోదావరి నీళ్లు పోలవరం నుంచి బనకచర్లకు తీసుకెళ్తా అని చెప్పా. సముద్రంలోకి వెళ్లే నీటిని తీసుకెళ్తామంటే ఒక పార్టీ రాజకీయం చేస్తోంది. నాకు 2 ప్రాంతాలు సమానం.. రెండు కళ్లు అని చెప్పా. కాళేశ్వరం ప్రాజెక్టుకు నేనెప్పుడూ అడ్డుచెప్పలేదు. గోదావరిపై ప్రాజెక్టులు కట్టండి, నీళ్లు తీసుకోండి’ అని వ్యాఖ్యానించారు.