News March 22, 2024
రూ.49కే 25 GB

ఇవాళ్టి నుంచి IPL-2024 ప్రారంభం కానున్న నేపథ్యంలో జియో తన యూజర్లకు శుభవార్త చెప్పింది. రూ.49 ప్రీపెయిడ్ డేటా ప్లాన్‌తో రోజుకు 25 జీబీ డేటాను అందిస్తోంది. ఆల్రెడీ యాక్టివ్ ప్లాన్ ఉన్న వారికే ఇది వర్తిస్తుంది. ఎయిర్‌టెల్‌లోనూ ఇదే ప్లాన్ ఉండగా.. 20GB డేటా మాత్రమే లభిస్తుంది. అలాగే జియో రూ.444 ప్లాన్‌లో 60 రోజుల వ్యాలిడిటీతో 100 GB డేటా లభిస్తుంది.
Similar News
News February 23, 2025
కాంగ్రెస్‌కు దక్కేది గుండు సున్నానే: కిషన్‌రెడ్డి

TG: రాష్ట్రంలో బీజేపీ మాత్రమే 3 ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. విద్యావంతులు, టీచర్లను మోసం చేశాయి కాబట్టే కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు పూర్తి స్థానాల్లో అభ్యర్థులను నిలిపే సాహసం చేయలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఇప్పుడు ఎన్నికలు వస్తే ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కదన్నారు.
News February 23, 2025
TGలో మద్యం బ్రాండ్ల కొత్త విధానానికి గ్రీన్ సిగ్నల్

TG: మద్యం బ్రాండ్ల కొత్త విధానానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో లేని విదేశీ, దేశీయ లిక్కర్ కంపెనీలు, బీర్ సంస్థల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ రిజిస్టర్ కాని కొత్త సప్లయర్స్ నుంచి ఎక్సైజ్ శాఖ అప్లికేషన్లు స్వీకరించనుంది. ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి ఆరోపణలు లేవని కోరుతూ నాణ్యత, ప్రమాణాలపై కంపెనీల నుంచి సెల్ఫ్ సర్టిఫికేషన్ తీసుకోవాలని నిర్ణయించింది.
News February 23, 2025
జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల

జేఈఈ మెయిన్ పేపర్-2 (BArch&B.Planning) ఫలితాలను NTA విడుదల చేసింది. <