News March 4, 2025

ఏలూరు: ఎమ్మెల్సీగా గెలిచిన కూటమి అభ్యర్ధి పేరాబత్తుల 

image

ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం భారీ విజయం సాధించారు. ఎన్నికల అధికారి, ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి చేతుల మీదుగా ఆయన గెలుపు పత్రం అందుకున్నారు. రాజశేఖరం వెంట ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఉన్నారు. రాజశేఖరం గెలుపుతో కూటమి నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు.

Similar News

News March 18, 2026

కామారెడ్డి జిల్లాలో పగలు సెగలు, రాత్రి వాన

image

గడిచిన 24 గంటల్లో జిల్లాలో వాతావరణం భిన్నంగా మారింది. మధ్యాహ్నం ఉక్కపోత, రాత్రి వర్షం, ఉదయం చలి గాలులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సోమూర్‌లో అత్యధికంగా 13.3 మి.మీ వర్షపాతం నమోదు కాగా, బిక్కనూరులో 38.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. జుక్కల్, డోంగ్లి, బీర్కూర్ ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షం కురిసింది. ఈ మార్పుల వల్ల ప్రజలు ఆరోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

News March 18, 2026

NTR: విచారణ ముందుకెళ్లకుండా అడ్డుకుంటున్న కూటమి నేత!

image

పంచాయతీల్లో అవినీతిని ఉపేక్షించబోమని Dy.CM పవన్ చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. రామవరప్పాడులో రూ.4కోట్ల అవినీతిపై సర్పంచ్‌ను సస్పెండ్ చేయగా, అదే సమయంలో విచారణ పూర్తయిన పెనుగంచిప్రోలులో చర్యలు శూన్యం. కూటమి నేత ఒత్తిళ్లు, పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ కారణంగానే అధికారులు వెనకడుగు వేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముత్యాల పంచాయతీలోనూ ఇదే నిశ్శబ్దం నెలకొంది.

News March 18, 2026

తాడూరులో 33.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

image

జిల్లాలోని పలుచోట్ల మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అకాల వర్షం కురిసింది. మధ్యరాత్రి రెండు గంటల తర్వాత ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. జిల్లాలోనే అత్యధికంగా తాడూరు మండలంలో 33.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. కోడేరులో 24.8, కల్వకుర్తిలో 18.8, బిజినేపల్లిలో 22.8, ఊర్కొండలో 18.3, నాగర్ కర్నూల్‌లో 18.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.