News March 22, 2024

డ్రగ్స్ కేసు కూపీ లాగుతున్న సీబీఐ

image

AP: విశాఖలో పట్టుబడ్డ 25 వేల కేజీల డ్రగ్స్ కేసులో సీబీఐ దర్యాప్తు కాకినాడ జిల్లాకు చేరింది. యు.కొత్తపల్లి మండలం మూలపేటలోని సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ పరిశ్రమలో ఇవాళ సీబీఐ అధికారులు దాడులు చేశారు. అక్కడి సిబ్బంది, కూలీల నుంచి వివరాలు సేకరించారు. ల్యాబ్‌లో ఉన్న వివిధ శాంపిల్స్‌ని విశాఖకు తరలించినట్లు సమాచారం. కాగా విశాఖకు చేరుకున్న డ్రగ్స్ కంటెయినర్ సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ పేరుతో బుక్ అయింది.

Similar News

News January 5, 2025

ప్రముఖ నటుడికి బ్రెయిన్ సర్జరీ

image

సినీ నటుడు ప్రభుకు చెన్నైలోని ఓ ఆస్పత్రిలో బ్రెయిన్ సర్జరీ జరిగింది. డిశ్చార్జ్ అయిన ఆయన ప్రస్తుతం ఇంట్లో కోలుకుంటున్నారని ఆయన PRO వెల్లడించారు. జ్వరం, తలనొప్పితో ప్రభు ఆస్పత్రిలో చేరగా, మెదడులోని ఓ ప్రధాన రక్తనాళంలో వాపు వచ్చినట్లు డాక్టర్లు గుర్తించారు. దీంతో మైనర్ సర్జరీ చేసినట్లు తెలుస్తోంది. ప్రభు తమిళ, తెలుగు, హిందీ, మలయాళంలో కలిపి దాదాపు 220 సినిమాల్లో నటించారు.

News January 5, 2025

సకలశాఖ మంత్రిగా నారా లోకేశ్: తాటిపర్తి

image

AP: మంత్రి నారా లోకేశ్ సకలశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారని YCP నేత తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. విద్యా వ్యవస్థలో లోకేశ్ ఏం సంస్కరణలు చేశారో చెప్పాలని నిలదీశారు. ‘కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దోపిడీ పెరిగిపోయింది. కూటమి నేతలు చెప్పే మాటలకు, పనులకు పొంతన ఉందా? ఇప్పటివరకు ప్రజలకు ఏం చేశారో చెప్పాలి. సూపర్ సిక్స్ హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా?’ అని ఆయన ప్రశ్నించారు.

News January 5, 2025

ICC ఫైనల్స్: రికార్డు సృష్టించిన ఆస్ట్రేలియా

image

ICC టోర్నీల్లో అత్యధిక సార్లు ఫైనల్ చేరిన జట్టుగా ఆస్ట్రేలియా (14) రికార్డు సృష్టించింది. తాజాగా WTC ఫైనల్ చేరుకోవడంతో ఈ ఘనతను సాధించింది. ఈ లిస్టులో రెండో స్థానంలో భారత్ (13), తర్వాతి స్థానాల్లో వరుసగా ENG (9), WI (8), SL (7) ఉన్నాయి. జూన్ 11 నుంచి SAతో జరిగే WTC ఫైనల్‌లో గెలిస్తే వరుసగా రెండు సార్లు WTC గెలిచిన జట్టుగా ఆసీస్ నిలవనుంది. గత WTC (2021-23) ఫైనల్‌లో INDపై AUS గెలిచిన సంగతి తెలిసిందే.