News March 4, 2025
మెదక్: తమ్ముడి దాడిలో అన్న మృతి

తమ్ముడు దాడి చేయడంతో అన్న మృతి చెందిన ఘటన మాసాయిపేట మండల కేంద్రంలో జరిగింది. స్థానికుల వివరాలు.. మాసాయిపేటకు చెందిన దుంపల రాజు, అతని తమ్ముడు చందు కుటుంబ కలహాల నేపథ్యంలో సోమవారం రాత్రి గొడవపడ్డారు. ఈ గొడవలో తమ్ముడు అన్న రాజుపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 4, 2026
జగన్ బొమ్మల కోసం రూ.650 కోట్లా.?: మంత్రి ఆనం

ASపేట మండలం హసనాపురంలో మంత్రి ఆనం శనివారం రాజముద్రతో ఉన్న కొత్త పాసుపుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. గతంలో ఉన్న గందరగోళానికి చెక్ పెడుతూ.. పక్కాగా పట్టాలిస్తున్నామని స్పష్టం చేశారు. సర్వే రాళ్ల మీద తన బొమ్మ వేయించుకోవడానికి జగన్ ఏకంగా రూ.650 కోట్లు తగలబెట్టారని ఆరోపించారు. ఆ ప్రజా ధనాన్ని రైతుల సంక్షేమానికి వాడితే బాగుండేదని చురకలు అంటించారు.
News January 4, 2026
మీకోసం వెబ్‌సైట్‌లో అర్జీలు నమోదు చేసుకోవచ్చు: కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి

పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోమవారం PGRS కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి కార్యాలయంలో ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించాలన్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్‌లో ప్రతిరోజూ వినతులు స్వీకరిస్తామన్నారు. అర్జీదారులు మీకోసం వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, వివరాలను 1100కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు అన్నారు.
News January 4, 2026
సింగరేణి నెగ్లిజెన్సీ.. విలువైన సంపద మాయం

అక్రమ దందాలు, చోరీలతో సింగరేణి ప్రతిష్ఠ మసకబారుతోంది. సింగరేణిలో భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు, స్టోర్ యార్డులు, స్క్రాప్ డిపోలలో చోరీలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు ప్రొడక్షన్ టైంలో తక్కువ బరువు చూపించి రాత్రివేళలో అదనపు బొగ్గు లోడ్లు తరలిస్తూ అక్రమ దందాకు పాల్పడుతున్నారట. విలువైన సింగరేణి సంపద చోరీకి గురవుతున్న సెక్యూరిటీ చేతులెత్తేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.


