News March 4, 2025
మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో మహిళా దినోత్సవ వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాస రావులు అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో మహిళా దినోత్సవ వారోత్సవాలపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వారోత్సవాల నిర్వహణ నోడల్ అధికారిగా ఐసీడీఎస్ పీడీ ఉమదేవిని నియమించారు.
Similar News
News March 4, 2025
ఐదో రౌండ్ పూర్తి: ముందంజలో బీజేపీ అభ్యర్థి

TG: ఆదిలాబాద్-కరీంనగర్-నిజామాబాద్-మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి దూసుకెళ్తున్నారు. ఐదు రౌండ్లు ముగిసేసరికి 7,142 ఓట్ల ముందంజలో ఉన్నారు. అంజిరెడ్డికి 38,553, నరేందర్ రెడ్డి (కాంగ్రెస్) 31,411, ప్రసన్న హరికృష్ణ (బీఎస్పీ) 26,300 ఓట్లు సాధించారు.
News March 4, 2025
ఆస్పత్రుల జబ్బుకు చికిత్స ఏది..?

అనారోగ్యం పాలైతే బాగు చేసే ఆస్పత్రులకే జబ్బు చేస్తే? ప్రైవేటు ఆస్పత్రులు డబ్బు జబ్బుతో తమ వద్దే మెడిసిన్ కొనాలని, అక్కడ దొరికే మెడిసిన్ మాత్రమే రాసి పేషంట్ల నుంచి డబ్బు దండుకోవడం సాధారణమైంది. ఈ డబ్బు జబ్బు నిజమేనన్న సుప్రీంకోర్టు, పరిష్కారం ఏమిటని, దీనిపై పిల్ వేసిన లాయర్‌ను అడిగింది. అయినా.. ప్రభుత్వాస్పత్రులే సరిగా ఉంటే మనకు ఈ దోపిడీ ఉండేదా? ప్రజా వైద్యం ప్రజలకు అందితేనే ప్రైవేటు దందా తగ్గేది.
News March 4, 2025
విశాఖలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఎత్తివేత: కలెక్టర్

విశాఖలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఎత్తివేసినట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ తెలిపారు.రాష్ట్రంలో వివిధ చోట్ల గ్రాడ్యుయేట్, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడటం, ఇతర ప్రక్రియలు ముగియటంతో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఎత్తివేసినట్లు మంగళవారం సాయంత్రం తెలిపారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.