News March 4, 2025

శ్రీ సత్యసాయి జిల్లాలో 413 మంది గైర్హాజరు

image

శ్రీ సత్యసాయి జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు మంగళవారం ఇంగ్లీష్ పేపర్-1 పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 413 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు ఇంటర్మీడియట్ విద్యాధికారి రఘునాథరెడ్డి తెలిపారు. జిల్లాలో 12,162 మంది విద్యార్థులకు గానూ 11,749 విద్యార్థులు హాజరయ్యారన్నారు. ఒకేషనల్ పరీక్షకు సంబంధించి 1,696 మంది విద్యార్థులకు గానూ 1,595 మంది హాజరయ్యారని పేర్కొన్నారు.

Similar News

News March 18, 2026

విశాఖ: మత్స్యకారులను కాపాడిన కోస్ట్ గార్డ్స్

image

నడిసంద్రంలో చిక్కుకున్న మత్స్యకారులను ఇండియన్ కోస్టల్ గార్డ్ కాపాడింది. విశాఖకు చెందిన మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. తీరానికి 300 కి.మీ.ల దూరలో బోటు మరమ్మతులకు గురైంది. దీంతో ప్రాణాలను అరచేతిలో పట్టుకొని కేంద్ర ప్రభుత్వం అందజేసిన ట్రాన్స్‌పాండర్ సాయంతో అధికారులను కాంటాక్ట్ అయ్యారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సమాచారం మేరకు కోస్ట్ గార్డులు సముద్రంలో చిక్కుకున్న వారిని కాపాడారు.

News March 18, 2026

చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్

image

చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు ఓ చిన్నారి ప్రాణాన్ని కాపాడారు. పాకాల(M) దామలచెరువుకు చెందిన శిరీష, విజయ్ దంపతులకు నెలలు నిండకుండా పాప పుట్టింది. పాలు సరిగ్గా తాగకకపోవడం, తల అసాధారణంగా పెరగడం, తరచూ మూర్చ రావడం వంటి లక్షణాలతో బాధ పడుతుంటేది. తలలో రక్త స్రావం, నీరు చేరినట్లు గుర్తించారు. న్యూరో సర్జన్ డాక్టర్ సాయినాథ్ రెడ్డి నేతృత్వంలో బ్రెయిన్ ఆపరేషన్ చేసి చిన్నారిని కాపాడారు.

News March 18, 2026

OFFICIAL: SRH కెప్టెన్‌గా ఇషాన్

image

IPL-2026 ప్రారంభంలోని కొన్ని మ్యాచులకు యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తారని SRH ప్రకటించింది. అలాగే అభిషేక్ శర్మ వైస్ కెప్టెన్‌గా ఉంటారని పేర్కొంది. పాట్ కమిన్స్ వెన్నునొప్పి గాయం నుంచి కోలుకున్న తర్వాత జట్టులో చేరుతారని తెలిపింది. దీంతో ఈనెల 28న RCBతో జరిగే తొలి మ్యాచ్‌లో కిషన్ జట్టును నడిపించనున్నారు.