News March 4, 2025

మోతె: ఇందిరమ్మ మోడల్ హౌస్‌ను పరిశీలించిన కలెక్టర్

image

మోతె మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ హౌస్‌ను మంగళవారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతిఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు అందజేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవన్నారు.

Similar News

News January 18, 2026

మాడ్యులర్ కిచెన్ చేయిస్తున్నారా?

image

మాడ్యులర్ కిచెన్‌ చేయించేటపుడు వెంటిలేషన్ బాగా ఉండేలా చూసుకోవాలి. సరుకులన్నీ భద్రపరచడానికి వీలుగా అల్మారా లేదా డీప్ డ్రాలను నిర్మించుకోవాలి. చాకులు, స్పూన్‌లు, గరిటెలు విడివిడిగా పెట్టుకొనే సౌలభ్యం ఉండేలా చూసుకోవాలి. అప్పుడే వస్తువులు నీట్‌గా కనిపిస్తాయి. కావాల్సిన వస్తువు వెంటనే చేతికి దొరుకుతుంది. వంటగదిలో ఎలక్ట్రానిక్ పరికరాలు వాడటానికి వీలుగా అవసరమైన చోట్లలో ప్లగ్ బోర్డ్స్ ఉండేలా చూసుకోవాలి.

News January 18, 2026

మహిళా పాలకుల చేతికి ఆసిఫాబాద్‌ జిల్లా!

image

ఆసిఫాబాద్ జిల్లా నూతన కలెక్టర్‌గా హరిత బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటివరకు కలెక్టర్‌గా పనిచేసిన వెంకటేశ్ దోత్రే బదిలీ కావడంతో ప్రభుత్వం ఆమెను నియమించింది. ఇప్పటికే జిల్లా ఎస్పీగా నితికా పంత్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్‌గా శ్రద్ధ శుక్ల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కీలకమైన జిల్లా స్థాయి అధికార పీఠాలపై మహిళలే ఉండటంతో, ఇకపై ఆసిఫాబాద్ జిల్లా పాలన పగ్గాలు పూర్తిగా మహిళల చేతుల్లోకి వెళ్లనున్నాయి.

News January 18, 2026

ప్రైవేట్ స్కూళ్లలో రెండేళ్లకోసారి 8% ఫీజు పెంపు?

image

TG: ప్రైవేట్ స్కూళ్లలో ఫీజును రెండేళ్లకోసారి 8% పెంచుకునేలా అనుమతించాలని విద్యాశాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంతకుమించి పెంచుకోవాలంటే రాష్ట్ర ఫీజు నియంత్రణ కమిటీ ఆమోదం తప్పనిసరి చేస్తూ ఫీజుల నియంత్రణ చట్టం విధివిధానాలను ఖరారు చేసినట్లు సమాచారం. మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత జరిగే క్యాబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి చట్టాన్ని తీసుకురానున్నట్లు తెలుస్తోంది.