News March 4, 2025
భూపాలపల్లి: ఆ కుటుంబాల్లో విషాదం

నిన్న రాత్రి రాంపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం <<15642532>>3కుటుంబాల్లో<<>> విషాదం నింపింది. మరణించిన పంబాపూర్ వాసి సతీశ్ భార్యకు ఈనెల 6న డెలివరీ డేట్ ఉంది.ఏడాది వయసు గల పాప కూడా ఉంది. ఇక మరో ఇద్దరు మృతులు మహాముత్తారం మండలం మీనాజీపేట వాసులు రవీందర్ రెడ్డి(42),నరసింహారెడ్డి(33)వరుసకు బంధువులు.నర్సింహకు పదేళ్లలోపు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వరుసగా మృతదేహాలు అంత్యక్రియలకు వెళ్లడం గ్రామస్థులందరినీ కంటతడి పెట్టించింది.
Similar News
News April 17, 2026
ఉమ్మడి ఆదిలాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్

రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తుండటంతో గురువారం గరిష్ఠంగా 41°C ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే రెండు రోజుల్లో ఇది 44°Cకు చేరుకుంటుందని ఐఎండీ హెచ్చరించింది. జిల్లాలో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని అధికారులు సూచించారు.
News April 17, 2026
పెరగనున్న MPల సంఖ్య.. జీతాల ఖర్చు ఎంత?

డీలిమిటేషన్ తర్వాత MPల సంఖ్య 850కి చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం ఒక్కో సభ్యుడి వేతనం ₹1.24 లక్షలు. కొత్తగా వచ్చే 307 మంది కోసం ఏటా అదనంగా దాదాపు ₹50 కోట్లు జీతాలు, పెన్షన్లకే వెచ్చించాలి. ఒక్కో MP ఆఫీసు ఖర్చు కింద ₹60,000, నియోజకవర్గ అలవెన్స్ కోసం ₹70,000 అందుకుంటున్నారు. పార్లమెంట్‌కు హాజరైతే రోజుకు ₹2,500 తీసుకుంటున్నారు. ఫ్రీ జర్నీ, గృహ వసతితో కలిపితే అదనపు ఖర్చు ₹వందల కోట్లకు చేరుతుంది.
News April 17, 2026
పార్వతీపురం: వాటర్ ట్యాంక్ పైనుంచి పడి వ్యక్తి మృతి

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని గురువారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. మన్యం జిల్లా సీతంపేట(M) కొత్తకోట గ్రామానికి చెందిన కూరంగి ప్రభాస్(22) గత నెల రోజుల నుంచి అక్కడ వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు చేస్తున్నాడు. ప్రమాదవశాత్తు కింద పడి తీవ్ర గాయాలు కావడంతో అక్కడక్కడే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.


