News March 4, 2025
భూపాలపల్లి: ఆ కుటుంబాల్లో విషాదం

నిన్న రాత్రి రాంపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం <<15642532>>3కుటుంబాల్లో<<>> విషాదం నింపింది. మరణించిన పంబాపూర్ వాసి సతీశ్ భార్యకు ఈనెల 6న డెలివరీ డేట్ ఉంది.ఏడాది వయసు గల పాప కూడా ఉంది. ఇక మరో ఇద్దరు మృతులు మహాముత్తారం మండలం మీనాజీపేట వాసులు రవీందర్ రెడ్డి(42),నరసింహారెడ్డి(33)వరుసకు బంధువులు.నర్సింహకు పదేళ్లలోపు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వరుసగా మృతదేహాలు అంత్యక్రియలకు వెళ్లడం గ్రామస్థులందరినీ కంటతడి పెట్టించింది.
Similar News
News March 16, 2026
వచ్చే ఏడాదే పోలవరం జాతికి అంకితం: CBN

AP: గోదావరి పుష్కరాలకు ముందే 2027లో పోలవరాన్ని జాతికి అంకితం ఇస్తామని CM CBN పునరుద్ఘాటించారు. ‘YCP పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కలిపే ప్రయత్నం చేసింది. రాజధాని లేని రాష్ట్రంలో మూడుముక్కలాట ఆడింది. కానీ అమరావతి నిర్మాణానికి పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో రైతులు భూములను త్యాగం చేశారు. వారందరూ తల ఎత్తుకునేలా రాజధాని నిర్మిస్తాం’ అని పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ సందర్భంగా స్పష్టం చేశారు.
News March 16, 2026
పుట్టపర్తి కలెక్టరేట్‌లో పొట్టి శ్రీరాములు జయంతి

పుట్టపర్తిలోని కలెక్టరేట్‌లో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, పలువురు అధికారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కలెక్టర్ కొనియాడారు. ఆయన నిస్వార్థ సేవలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు.
News March 16, 2026
నంద్యాలలో పొట్టి శ్రీరాములు జయంతి

నంద్యాల సంజీవ్ నగర్ సర్కిల్‌లో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు మహాత్మా గాంధీ ఆశయాలతో పనిచేసిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడని కలెక్టర్ కొనియాడారు. కులమత భేదాలు లేని సమానత్వ సమాజం కోసం ఆయన ఎంతో కృషి చేశారని ఆమె గుర్తుచేశారు.


