News March 4, 2025
భూపాలపల్లి: ఆ కుటుంబాల్లో విషాదం

నిన్న రాత్రి రాంపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం <<15642532>>3కుటుంబాల్లో<<>> విషాదం నింపింది. మరణించిన పంబాపూర్ వాసి సతీశ్ భార్యకు ఈనెల 6న డెలివరీ డేట్ ఉంది.ఏడాది వయసు గల పాప కూడా ఉంది. ఇక మరో ఇద్దరు మృతులు మహాముత్తారం మండలం మీనాజీపేట వాసులు రవీందర్ రెడ్డి(42),నరసింహారెడ్డి(33)వరుసకు బంధువులు.నర్సింహకు పదేళ్లలోపు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వరుసగా మృతదేహాలు అంత్యక్రియలకు వెళ్లడం గ్రామస్థులందరినీ కంటతడి పెట్టించింది.
Similar News
News March 5, 2026
మన అతిథులపై దాడి చేశారు: ఒమర్ అబ్దుల్లా

హిందూ మహాసముద్రంలో <<19299071>>ఇరాన్ నౌక<<>>పై అమెరికా దాడి చేయడం దురదృష్టకరమని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. ‘ఇండియాలో నేవీ విన్యాసాల అనంతరం వెళ్తున్న షిప్‌పై దాడి చేశారు. వాళ్లు మన అతిథులు. ఈ వ్యవహారంలో మన దేశాన్నీ లాగుతున్నారు’ అని చెప్పారు. కశ్మీర్‌లో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేందుకు కొందరు యత్నిస్తున్నారని, వాళ్లను సహించబోమని హెచ్చరించారు.
News March 5, 2026
కర్నూలు: 15న ఫైనల్ పరీక్ష

అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలో ఈనెల 15న ఫైనల్ పరీక్ష జరగనుంది. 1.61లక్షల మంది హాజరయ్యేలా చూడాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. ఫైనల్ పరీక్షల నిర్వహణలో తీసుకోవాల్సిన చర్యలపై వయోజన విద్య, డీఆర్డీఏ, మెప్మా, ఐసీడీఎస్ తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అందరూ ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు.
News March 5, 2026
NGKL: ‘మహిళా సాధికారతతోనే సమాజాభివృద్ధి’

అంతర్జాతీయ మహిళా దినోత్సవం-2026 సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. అడిషనల్ కలెక్టర్ జి.వి. శ్యాంప్రసాద్ లాల్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. మహిళల అభివృద్ధి ద్వారానే సమాజం పురోగమిస్తుందని పేర్కొన్నారు.


