News March 4, 2025
మూడోసారి బెయిల్ పొందిన రెజ్లర్ సుశీల్ కుమార్

మర్డర్ కేసులో మాజీ రెజ్లర్ సుశీల్ కుమార్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.50,000 బాండు, 2 ష్యూరిటీలు ఇచ్చాక ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. 2021, మేలో జూనియర్ రెజ్లర్ సాగర్ ధన్‌ఖడ్ హత్య కేసులో ఆయన ప్రధాన నిందితుడు. దీంతో పాటు అల్లర్లు, అక్రమంగా గుమికూడటం వంటి అభియోగాలు ఆయనపై నమోదయ్యాయి. 2023, మార్చిలో తండ్రి అంత్యక్రియలు, జులై 23న మోకాలి ఆపరేషన్ కోసం ఆయన వారం పాటు బెయిల్ పొందడం గమనార్హం.
Similar News
News March 5, 2025
ఆ మూవీలో ప్రతీ సీన్ గుర్తుంది: సమంత

సినిమా ఇండస్ట్రీలో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సమంత కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసినట్లు తెలిపారు. తొలి చిత్రం ‘మాస్కో కావేరి’ షూటింగ్ అంతరాయాల వల్ల పెద్దగా గుర్తులేదన్నారు. ఆ తర్వాత మొదలైన ‘ఏమాయ చేశావే’లో అన్ని సీన్లు గుర్తున్నట్లు చెప్పారు. ఆ సినిమాలోని ప్రతి డీటెయిల్ ఇప్పటికీ మర్చిపోలేదన్నారు. ఆ స్థాయిలో సంతృప్తి ఇచ్చిన పాత్రలు తక్కువని, గౌతమ్ మేనన్‌తో పనిచేయడం గొప్ప అనుభూతి అని తెలిపారు.
News March 5, 2025
భారత్ గెలుపు.. కాంగ్రెస్ నేత షామా ట్వీట్

ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించిన టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు అని కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ ట్వీట్ చేశారు. ‘కీలక మ్యాచ్‌లో 84 రన్స్ చేయడంతో పాటు ICC నాకౌట్ మ్యాచుల్లో వెయ్యి రన్స్ చేసిన తొలి ప్లేయర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీకి ప్రత్యేక అభినందనలు’ అని ఆమె రాసుకొచ్చారు. కాగా ఇటీవల రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేయడంతో షామా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.
News March 4, 2025
ఐదో రౌండ్ పూర్తి: ముందంజలో బీజేపీ అభ్యర్థి

TG: ఆదిలాబాద్-కరీంనగర్-నిజామాబాద్-మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి దూసుకెళ్తున్నారు. ఐదు రౌండ్లు ముగిసేసరికి 7,142 ఓట్ల ముందంజలో ఉన్నారు. అంజిరెడ్డికి 38,553, నరేందర్ రెడ్డి (కాంగ్రెస్) 31,411, ప్రసన్న హరికృష్ణ (బీఎస్పీ) 26,300 ఓట్లు సాధించారు.