News March 4, 2025
జగిత్యాల జిల్లాలో 28 ఇంటర్ పరీక్ష కేంద్రాలు

జగిత్యాల జిల్లాలో 28 ఇంటర్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఇంటర్ పరీక్షల కన్వీనర్ నారాయణ మంగళవారం తెలిపారు. పరీక్షల నిర్వహణకు కాపీయింగ్ జరగకుండా 2 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను, 4 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు వారి వెంట ఏ విధమైన ప్రింటెడ్ మెటీరియల్, మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు, స్మార్ట్, నార్మల్ వాచ్లు, కాలిక్యులేటర్లు తీసుకురావద్దన్నారు.
Similar News
News March 18, 2026
గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలి: కలెక్టర్

ప్రభుత్వం అందించే పథకాల ఆర్థిక సహాయంతో గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని బాపట్ల కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ సూచించారు. మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో గృహ నిర్మాణం, యూనిఫైడ్ సర్వే, ఆస్తి పన్ను వసూళ్లపై సమీక్షించారు. లబ్ధిదారులు అందుబాటులో ఉన్న సహాయాన్ని వినియోగించుకోవాలన్నారు. అధికారులు పనులను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
News March 18, 2026
TODAY HEADLINES

☛ రాష్ట్రానికి అదనంగా 24వేల మెట్రిక్ టన్నుల LPG: CM CBN
☛ చంద్రబాబు తీరువల్లనే డ్రగ్స్ దందాలు: జగన్
☛ మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై సిట్ ఏర్పాటు చేసిన TG ప్రభుత్వం
☛ KCR కూడా డ్రగ్ టెస్ట్‌కు రావాలి: TPCC చీఫ్
☛ ఆరు గ్యారంటీల ఫైల్ ఎక్కడ? కాకి ఎత్తుకెళ్లిందా?: KTR
☛ ఇంకా ఆందోళనకరంగానే గ్యాస్ నిల్వలు: కేంద్రం
☛ అఫ్గాన్‌పై పాక్ దాడులు.. ఖండించిన భారత్
News March 18, 2026
హాస్టల్స్‌లో సమస్యల పరిష్కారానికి కృషి చేయండి: కలెక్టర్

జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో సమస్యల పరిష్కారం కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం
మచిలీపట్నం కలెక్టరేట్‌లో హాస్టళ్ల సంయుక్త తనిఖీ కమిటీ సమావేశం నిర్వహించారు. వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, ఆరోగ్యం తదితర సమస్యలపై సమీక్షించారు. వసతి గృహాల నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు.


