News March 4, 2025

మహబూబాబాద్: ‘అర్ధరాత్రి తలుపులు కొడుతున్నారు’

image

మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని స్థానిక కంకరబోర్డు ఏరియాలో అర్ధరాత్రి సమయంలో దొంగలు, అపరిచితులు సంచరిస్తూ ఇంటి తలుపులు కొడుతున్నారని స్థానికులు తెలిపారు. దీంతో తాము భయాందోళనకు గురవుతున్నామని చెప్పారు. ఈ సందర్భంగా సీపీఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి.అజయ్ సారథి మాట్లాడుతూ.. భయాందోళనకు గురి కావొద్దని, ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు.

Similar News

News March 4, 2026

పార్వతీపురం: రీజనల్ కోఆర్డినేటర్‌గా బూడి ముత్యాలనాయుడు

image

శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలకు YCP రీజనల్ కోఆర్డినేటర్‌గా మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు YS.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలిపారు.

News March 4, 2026

గ్రామసభల్లోనే లబ్ధిదారుల వివరాలు: ఉత్తమ్

image

సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత ఉండాలని మంత్రి ఉత్తమ్‌ అధికారులను ఆదేశించారు. గ్రామ సభల్లోనే రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ లబ్ధిదారుల వివరాలను వెల్లడించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. పథకాల అమలులో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని, ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

News March 4, 2026

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో వరుస నేరాలు.. ప్రజల ఆందోళన

image

NGKL జిల్లాలో వరుసగా జరుగుతున్న నేరాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. <<19213447>>కుమ్మెర<<>> మరువక ముందే, <<19293278>>KGBV<<>> విద్యార్థిని ప్రసవించి బిడ్డను డస్ట్‌బిన్‌లో పడేసిన ఘటన సంచలనం రేపింది. కొల్లాపూర్‌కు చెందిన గర్భిణి మౌనిక భర్త <<19293566>>వేధింపుల<<>> వల్లే మృతి చెందిదని అక్క పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిజినేపల్లి, గౌరారం శివారులో కొల్లాపూర్‌కు చెందిన జగన్ <<19278148>>హత్య<<>>కు గురయ్యాడు.