News March 4, 2025
తూ.గో: ఇంటర్ పరీక్షకు 23,655 మంది విద్యార్థుల హాజరు

తూ.గో జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఇంగ్లీష్-1 పరీక్షకు 23,655 మంది విద్యార్థులు హాజరైనట్లు ఆర్‌ఐఓ ఎల్ నరసింహం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 51 కేంద్రాలలో ఈ పరీక్షను నిర్వహించగా జనరల్, ఒకేషనల్ విభాగాల్లో 795 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. ఆర్‌ఐఓ, డీవీఈఓ, ఫ్లయింగ్, సెన్సింగ్ స్క్వాడ్లు, కస్టోడియన్లు ఈ పరీక్షలను పర్యవేక్షించారన్నారు.
Similar News
News March 25, 2026
వేసవి ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ చేకూరి

వేసవి నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం, తాగునీటి సరఫరా, విద్యుత్ వినియోగం, అత్యవసర సేవల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయ శాఖల అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. దీనికి సంబంధించి బుధవారం వివిధ శాఖలకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. వైద్య, ఆరోగ్య శాఖ, తాగునీటి సరఫరా విభాగం, విద్యుత్, విద్యాశాఖలు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
News March 25, 2026
రాజమండ్రి చేరుకున్న వి.ఎల్.కాంతారావు

పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలన కోసం కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వి.ఎల్.కాంతారావు బుధవారం రాజమండ్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఉన్నతాధికారులు, జిల్లా పరిపాలనా అధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టు పురోగతిపై కాంతారావు అధికారులతో చర్చించనున్నారు.
News March 24, 2026
కొవ్వూరు: విద్యుత్ తీగలపైనే కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి

కొవ్వూరు సమీపంలోని నందమూరులో విద్యుత్ పనులు చేస్తూ శ్రీకాంత్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మరమ్మతులు జరుగుతుండగానే విద్యుత్ సరఫరా ఇవ్వడంతో ఆయన తీగలపైనే ప్రాణాలు కోల్పోయారు. రెగ్యులర్ ఉద్యోగులకు బదులు కాంట్రాక్ట్ సిబ్బందిని ప్రమాదకర పనులకు పంపడమే ఈ ఘోరానికి కారణమని తోటి కార్మికులు ఆరోపిస్తున్నారు.


