News March 4, 2025
శాసనసభ సభ్యులకు క్రీడా పోటీలు

AP: శాసనసభ సభ్యులకు క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పురుషులకు క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ.. మహిళలకు బ్యాడ్మింటన్, త్రోబాల్, టగ్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహించనున్నారు. చీఫ్ విప్‌లు, విప్‌లకు పేర్లు ఇవ్వాలని స్పీకర్ అయ్యన్న సభలో ప్రకటించారు. ఈ నెల 18,19,20 తేదీల్లో నిర్వహించే పోటీలకు IASలు, హైకోర్టు జడ్జిలను ఆహ్వానించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
Similar News
News April 10, 2026
HYD నుంచి అయోధ్య, కాశీకి స్పెషల్ ప్యాకేజీ

తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం IRCTC ఏప్రిల్ 14 నుంచి జూన్ 12 వరకు HYD నుంచి అయోధ్య, కాశీ, వైష్ణో దేవి, దక్షిణ భారతదేశ క్షేత్రాలను సందర్శించేలా 4 ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. ఈ టూర్లలో ప్రయాణం, హోటల్ వసతి, 3 పూటలా భోజనం, గైడ్, భద్రతా సౌకర్యాలు కల్పిస్తుండగా, టికెట్ ధరలు రూ.14,500 నుంచి రూ.34,100 వరకు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తిగల వారు IRCTC వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
News April 10, 2026
శాంతి చర్చల వేళ.. పాక్vsఇజ్రాయెల్

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చల వేళ పాక్, ఇజ్రాయెల్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్ దుష్ట, క్యాన్సర్ దేశమని పాక్ రక్షణ మంత్రి ఖవాజా విమర్శించారు. గాజా, లెబనాన్‌లో మారణ హోమం చేస్తోన్న ఆ దేశాన్ని నాశనం చేయాలన్నారు. ఈ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ఘాటుగా స్పందించింది. మీడియేటర్‌గా ఇలాంటి కామెంట్లు దారుణమంది. ఉగ్రవాదుల నుంచి ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకుంటుందని పేర్కొంది.
News April 10, 2026
కాసేపట్లో క్యాబినెట్ భేటీ.. అమరావతిపై కీలక చర్చ

AP: సీఎం CBN అధ్యక్షతన ఈ ఉదయం 10.30గంటలకు క్యాబినెట్ భేటీ కానుంది. ముందుగా అమరావతి చట్టం ఆమోదం పొందిన నేపథ్యంలో ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికి క్యాబినెట్ ధన్యవాదాలు తెలపనుంది. ఆపై రాజధానిలో నిర్మాణాలపై చర్చ జరగనుంది. 16వ SIPB సమావేశంలో చర్చించిన ప్రాజెక్టులకు క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. అలాగే రాష్ట్రంలో 28 జిల్లాల ఆధారంగా జోనల్ వ్యవస్థను ఖరారు చేసే అంశంపైనా చర్చ జరగనుంది.


