News March 4, 2025
ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డులు

TG: కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది. కార్డు నమూనాను సీఎం రేవంత్ ఫైనల్ చేశారు. లేత నీలి రంగులోని కార్డుపై సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ఫొటోలు ఉంటాయి.
Similar News
News March 26, 2026
విజయవాడలో డ్రగ్స్ స్వాధీనం.. యువకుల అరెస్ట్

విజయవాడకు చెందిన ఇద్దరు యువకులను పెనమలూరు పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. విజయవాడకు చెందిన యువకులు అనంత కుమార్, మహేష్ డ్రగ్స్‌ను విక్రయిస్తున్నారన్న సమాచారంతో పెనమలూరు పోలీసులు దాడి చేశారు. వారి నుంచి 5 కేజీల గంజాయి, 1 గ్రామ్ కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు పెనమలూరు సీఐ వెల్లడించారు. కాగా గ్యాంగ్ వార్ కేసులో అనంత్ కుమార్ నిందితుడిగా ఉన్నాడన్నారు.
News March 26, 2026
కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో ఉరుములతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కామారెడ్డి, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు పడే ఆస్కారముందని చెప్పింది. గంటకు 40కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News March 26, 2026
RCB ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

IPL: ఎల్లుండి లీగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో RCB జట్టు కీలక బౌలర్ హేజిల్‌వుడ్ ఇండియా చేరుకున్నారు. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ NOC ఇవ్వడంతో ఆయన కొద్దిసేపటి కిందటే బెంగళూరుకు వచ్చారు. ఇవాళ RCB క్యాంప్‌లో జాయిన్ కానున్న ఆయన 28వ తేదీ SRHతో జరిగే తొలి మ్యాచులో ఆడే ఛాన్స్ ఉంది. ఇక ఆ జట్టు కీలక బౌలర్ యశ్ దయాల్ వ్యక్తిగత కారణాలతో దూరమైన వేళ హేజిల్‌వుడ్ రాకతో RCB బౌలింగ్ దళం బలం పుంజుకున్నట్లు అయింది.


