News March 4, 2025

GWL: ‘లింగమ్మ బావి సుందరీకరణ చర్యలు చేపట్టాలి’

image

గద్వాల పట్టణంలోని లింగమ్మ బావి సుందరీకరణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. మంగళవారం అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ ఆర్కిటిక్ శ్రీలేఖతో కలిసి లింగమ్మ బావిని పరిశీలించారు. బావిలోకి దిగేందుకు ఉన్న స్టెప్ లెవెల్‌ను పునరుద్ధరించి, ఎప్పటికీ నీరు ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. బావి చుట్టూ రైలింగ్ ఫినిషింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ను సిద్ధం చేయాలని సూచించారు.

Similar News

News March 11, 2026

నిర్మల్: మీ పశువులను ఈ వ్యాధి నుంచి కాపాడుకోండి

image

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఆవులకు, గేదెలకు గాలికుంటు వ్యాధి సోకకుండా పశు వైద్యులు టీకాలు వేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఆవులు సుమారు1,77,954, గేదలు 1,1,99,073 ఉన్నాయి. ఈ వ్యాధి సోకినప్పుడు తీవ్ర జ్వరం, నోటిలో, చన్నులతో పాటు కాలు గిట్టల మధ్య పుండ్లు ఏర్పడతాయి. దీంతో ఆహారం తీసుకోకుండా ముడుచుకొని పడుకుంటాయి. దీనితో అవి చనిపోయే ప్రమాదం ఉంది. పాడి రైతులు తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని కోరుతున్నారు.

News March 11, 2026

బాలికకు అండగా తిరుపతి కలెక్టర్, ఎస్పీ

image

ఓబులవారిపల్లి మండలం పెద్ద ఊరంపాడుకు చెందిన గిరిజన బాలిక పూజ(10) తప్పిపోయిన ఘటనలో పోలీసులు వేగంగా స్పందించారు. గంటల్లోనే గుర్తించి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. అనంతరం కలెక్టర్ డా.వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఇద్దరికి రూ.50 వేల చొప్పున రూ.లక్ష ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్రకటించారు. గురుకుల పాఠశాలలో ఉచిత విద్య, వసతి కల్పించాలని ఆదేశించారు.

News March 11, 2026

విశాఖ: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

image

విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన విశాఖలో మంగళవారం సాయంత్రం జరిగింది. గోస్తాని గేటు ప్రధాన రహదారి పక్కన హై వోల్టేజ్ స్తంభం ఎక్కిన వ్యక్తి విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు హార్బర్ పోలీసులు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తి హై వోల్టేజ్ స్తంభం ఎక్కుతుండగా నేవీ సిబ్బంది గమనించి దిగిపోమని హెచ్చరించినప్పటికీ మరింత మీదకు వెళ్లడంతో వైర్లు తగిలి ప్రమాదానికి గురైనట్లు చెప్పారు.