News March 4, 2025

విజ‌య‌వాడ‌: ఇంట‌ర్ ప‌రీక్షా కేంద్రాల‌ను త‌నిఖీ చేసిన కలెక్టర్ 

image

విజ‌య‌వాడ‌లోని బిష‌ప్ అజ‌ర‌య్య జూనియ‌ర్ క‌ళాశాల‌, శ్రీ దుర్గామ‌ల్లేశ్వ‌ర సిద్ధార్థ మ‌హిళా క‌ళాశాలలోని ఇంట‌ర్ ప‌రీక్షా కేంద్రాల‌్లో మంగ‌ళ‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ త‌నిఖీ చేశారు. అనంతరం విద్యార్థులు ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ప‌రీక్ష‌లు రాసేందుకు చేసిన ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. వేస‌వి నేప‌థ్యంలో తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాల‌ని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు. ఆయన పలువురు అధికారులు ఉన్నారు. 

Similar News

News March 5, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 5, 2025

భూపాలపల్లి: ఇంటర్ విద్యార్థులకు ఎస్పీ సూచనలు

image

నేడు ఇంటర్ పరీక్షకి హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్‌లో పొందుపరిచిన విధంగా సమయానికి చేరుకోవాలని భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమవెంట పరీక్షా హాల్‌లోకి సెల్ ఫోన్లు, ట్యాబ్, పెన్ డ్రైవ్, బ్లూటూత్, ఎలక్ట్రానిక్ వాచ్, కాలిక్యులేటర్లు, వాలెట్లు వంటివి తీసుకెళ్లడానికి అనుమతి లేదన్నారు. పరీక్షా కేంద్రంలోకి వెళ్లేముందే పోలీసులు గేటు వద్ద తనిఖీలు నిర్వహిస్తారన్నారు.

News March 5, 2025

ములుగు: ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: ఎస్పీ

image

నేడు ములుగు జిల్లా వ్యాప్తంగా జరగబోయే ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీశ్ ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. అదే విధంగా పరీక్షా కేంద్రం సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లు అన్నీ కూడా మూసివేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లరాదని తెలిపారు.

error: Content is protected !!