News March 4, 2025

హనుమకొండ: DANGER ప్లేస్.. మరో వ్యక్తి మృతి

image

హసన్‌పర్తి మండలం కోమటిపల్లిలోని నిరూప్ నగర్ తండా సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఉనికిచర్ల ప్రధాన రహదారిపై ఈరోజు యాక్సిడెంట్ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. కాజీపేట మండలం టేకులగూడెం గ్రామానికి చెందిన కడుగుల రవి(60) బైక్‌పై హనుమకొండ వెళ్తుండగా ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి కింద పడ్డాడు. దీంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. కాగా గత ఆరు నెలల్లోనే సేమ్ ప్లేస్‌లో ఐదుగురు చనిపోవడం గమనార్హం.

Similar News

News March 5, 2025

వరంగల్‌కు కొత్త పోలీస్ జాగిలాలు

image

నేరాలకు పాల్పడిన నిందితులను పట్టుకోవడం పోలీసు జాగిలాలు కీలకంగా నిలుస్తున్నాయని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు నూతనంగా వచ్చిన పోలీస్‌ జాగిలాలను సీపీ మంగళవారం పరిశీలించారు. గత నెల 28న పోలీస్‌ జాగిలాల శిక్షణా కేంద్రంలో 8 నెలల శిక్షణను పూర్తి చేసుకుని వచ్చిన 5 పోలీస్‌ జాగిలాలు వరంగల్‌ కమిషనరేట్‌ పోలీస్‌ డాగ్‌ స్వ్కాడ్‌లో చేరి విధులు నిర్వర్తించేందుకు సిద్ధమయ్యాయి.

News March 5, 2025

వరంగల్ జిల్లా నేటి టాప్ న్యూస్

image

వరంగల్: నేడు మంచినీటి సరఫరాకు అంతరాయం☑️విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగొద్దని సీఎస్ శాంతకుమారి ఆదేశం☑️వర్ధన్నపేట: నీరు లేక ఎడారిగా మారుతున్న ఆకేరు వాగు☑️నల్లబెల్లి: నేషనల్ స్కాలర్షిప్‌కు ఎంపికైన విద్యార్థిని☑️వరంగల్‌కు కొత్త పోలీసు జాగిలాలు☑️వరంగల్ అతివేగంగా డివైడర్‌ని ఢీ కొట్టి వ్యక్తి మృతి☑️మామునూరు: ఎయిర్‌పోర్టు భూముల వద్ద ఉద్రిక్తత

News March 5, 2025

వరంగల్: నిట్ పరీక్ష కేంద్రాలను గుర్తించాలి..

image

జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష 2025 నిర్వహణకు పరీక్ష కేంద్రాలను గుర్తించాలని కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. మే 4న జరిగే నీట్ పరీక్ష నిర్వహణ సెంటర్ల ఎంపిక, కనీస సౌకర్యాలు కల్పనపై కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. వరంగల్ జిల్లా నుంచి 6,300 మంది విద్యార్థులు రాయడానికి అవసరమైన సెంటర్లు 20 గదుల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు లేదా కళాశాలను గుర్తించాలని ఆదేశించారు.

error: Content is protected !!