News March 4, 2025

దుఃఖాన్ని దిగమింగుతూ పరీక్ష రాసిన విద్యార్థి

image

తమిళనాడులో సునీల్ అనే విద్యార్థి తన తల్లి మరణంలోనూ తన కర్తవ్యాన్ని వీడలేదు. సుబ్బలక్ష్మీ అనే మహిళ సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించింది. అదే రోజు ఇంటర్ పరీక్షలు మెుదలు. నీ భవిష్యత్తే తల్లి కోరుకునేదని, పరీక్ష రాయాలని బంధువులు ఒత్తిడి చేశారు. దీంతో తీవ్ర దుఃఖంలోనూ తల్లికి పాదాభివందనం చేసి పరీక్ష రాసాడు. ఈ ఘటన అందరిని కంటతడి పెట్టించింది. ప్రభుత్వం అతనికి అండగా ఉంటామని హామీ ఇచ్చింది.

Similar News

News March 26, 2026

రేపు వైన్స్ బంద్

image

TG: శ్రీరామనవమి పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు శుక్రవారం బంద్ కానున్నాయి. మద్యం దుకాణాలు రేపు మూసి ఉంటాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. వైన్స్‌తో పాటు కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు, మిలిటరీ క్యాంటీన్లు బంద్ చేయాలని హైదరాబాద్‌లో ఆదేశాలు జారీ అయ్యాయి.

News March 26, 2026

ఇరాన్‌కు షాక్.. హార్ముజ్‌ బ్లాక్ చేసిన నేవీ చీఫ్ హతం!

image

హార్ముజ్ ఒడ్డున ఉండే బందర్ అబ్బాస్ సిటీపై జరిపిన దాడుల్లో ఇరాన్ నేవీ చీఫ్ అలీరెజా హతమైనట్లు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. హార్ముజ్‌ను బ్లాక్ చేయడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. ఈ జలసంధిపై పట్టు కోసం యుద్ధం సాగుతున్న వేళ ఇది కీలక పరిణామంగా మారింది.

News March 26, 2026

వీర సైనికులకు కేంద్రం గుడ్ న్యూస్!

image

గ్యాలంట్రీ అవార్డు గ్రహీతలకు భారత ప్రభుత్వం శుభవార్త అందించింది. సేన, నేవీ సేన, వాయు సేన పతకాలు పొందిన జవాన్లకు ఇండియన్ రైల్వేలో లైఫ్‌లాంగ్ ఫ్రీ జర్నీ సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరు మరొకరితో కలిసి ఫస్ట్ క్లాస్, 2 ఏసీ లేదా ఏసీ ఛైర్ కార్లలో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ సదుపాయం అవార్డు గ్రహీతలకు, వారి జీవిత భాగస్వాములకు లేదా అవివాహిత అమరవీరుల తల్లిదండ్రులకు వర్తిస్తుంది.