News March 4, 2025
జనగామ: ప్రైవేట్ వైద్యుడి ARREST

టిప్పు సుల్తాన్ వారసుడినని, ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి కోట్లు కాజేసిన ఓ ప్రైవేట్ వైద్యుడిని జనగాం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసినట్లు తెలిపారు. తమిళనాడుకు చెందిన అబ్దుల్ రహీద్ సుల్తాన్ రాజా ప్రస్తుతం టిప్పు సుల్తాన్ అనే ట్రస్ట్‌కు ఛైర్మన్‌గా ఉన్నాడు. అలాగే జనగామలో కేకే పేరుతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిని నడిపిస్తున్నాడు. సుమారు రూ.55 కోట్లకు పైగా ప్రజలను మోసం చేశారని పలువురు చెబుతున్నారు.
Similar News
News March 5, 2025
భూపాలపల్లి: ఇంటర్ విద్యార్థులకు ఎస్పీ సూచనలు

నేడు ఇంటర్ పరీక్షకి హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్‌లో పొందుపరిచిన విధంగా సమయానికి చేరుకోవాలని భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమవెంట పరీక్షా హాల్‌లోకి సెల్ ఫోన్లు, ట్యాబ్, పెన్ డ్రైవ్, బ్లూటూత్, ఎలక్ట్రానిక్ వాచ్, కాలిక్యులేటర్లు, వాలెట్లు వంటివి తీసుకెళ్లడానికి అనుమతి లేదన్నారు. పరీక్షా కేంద్రంలోకి వెళ్లేముందే పోలీసులు గేటు వద్ద తనిఖీలు నిర్వహిస్తారన్నారు.
News March 5, 2025
ములుగు: ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: ఎస్పీ

నేడు ములుగు జిల్లా వ్యాప్తంగా జరగబోయే ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీశ్ ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. అదే విధంగా పరీక్షా కేంద్రం సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లు అన్నీ కూడా మూసివేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లరాదని తెలిపారు.
News March 5, 2025
రికార్డ్స్ కంటే జట్టు గెలుపే ముఖ్యం: కోహ్లీ

తనకు వ్యక్తిగత రికార్డుల కంటే కూడా జట్టు గెలుపే ముఖ్యమని టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అన్నారు. ఆసీస్‌తో మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడారు. ‘ఈ మ్యాచులో నేను సెంచరీ చేసుంటే బాగుండేది. కానీ జట్టు గెలుపు అంత కన్నా ముఖ్యం. మైలురాళ్ల గురించి పట్టించుకోకుంటేనే అవి దక్కుతాయి. సెంచరీ మిస్సైందనే బాధ ఏమాత్రం లేదు. ఈ ఇన్నింగ్స్‌లో నేను తీసిన సింగిల్స్ సంతోషాన్ని ఇచ్చాయి’ అని ఆయన పేర్కొన్నారు.