News March 4, 2025

యువత ఆకాంక్షలు నెరవేర్చాలి: మంత్రి లోకేశ్

image

AP: పట్టభద్రుల MLC ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆలపాటి రాజేంద్ర, పేరాబత్తుల రాజశేఖర్ మంగళగిరిలోని TDP ఆఫీసులో మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. వారికి అభినందనలు తెలిపిన మంత్రి మాట్లాడారు. ‘ఈ విజయంతో మనపై మరింత బాధ్యత పెరిగింది. యువత మనపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చే దిశగా చిత్తశుద్ధితో పని చేయాలి. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని లోకేశ్ అన్నారు.

Similar News

News March 5, 2025

మార్చి 5: చరిత్రలో ఈరోజు

image

1901: సినీ నటుడు ఈలపాట రఘురామయ్య జననం
1917: సినీ నటి కాంచనమాల జననం
1953: రష్యా మాజీ అధ్యక్షుడు స్టాలిన్ మరణం
1958: సినీ నటుడు నాజర్ జననం
1984: సినీ నటి ఆర్తీ అగర్వాల్ జననం
1985: నటి వరలక్ష్మి శరత్ కుమార్ జననం
1996: హీరోయిన్ మీనాక్షి చౌదరి జననం
2004: సినీ నటుడు కొంగర జగ్గయ్య మరణం

News March 5, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 5, 2025

రికార్డ్స్‌ కంటే జట్టు గెలుపే ముఖ్యం: కోహ్లీ

image

తనకు వ్యక్తిగత రికార్డుల కంటే కూడా జట్టు గెలుపే ముఖ్యమని టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అన్నారు. ఆసీస్‌తో మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడారు. ‘ఈ మ్యాచులో నేను సెంచరీ చేసుంటే బాగుండేది. కానీ జట్టు గెలుపు అంత కన్నా ముఖ్యం. మైలురాళ్ల గురించి పట్టించుకోకుంటేనే అవి దక్కుతాయి. సెంచరీ మిస్సైందనే బాధ ఏమాత్రం లేదు. ఈ ఇన్నింగ్స్‌లో నేను తీసిన సింగిల్స్ సంతోషాన్ని ఇచ్చాయి’ అని ఆయన పేర్కొన్నారు.

error: Content is protected !!