News March 4, 2025
నెల్లూరు: ఇంటర్ పరీక్షకు 921 మంది గైర్హాజరు

ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లిష్ పరీక్ష మంగళవారం ప్రశాంతంగా జరిగినట్లు ఆర్‌ఐవో డాక్టర్ ఎ.శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం 79 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు 27,613 మంది విద్యార్థులకుగాను 26,893 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. 921 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. ఒకేషనల్‌లో 1394 మంది విద్యార్థులకు 164 మంది విద్యార్థులు గైర్హజరయ్యారని ఆర్‌ఐవో తెలిపారు.
Similar News
News March 31, 2026
నెల్లూరు: బాలికపై లైంగికదాడి.. నిందితుడికి 20 ఏళ్ల జైలు

బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడిన కేసులో నేరం రుజువు కావడంతో సంగం(M)మక్తాపురానికి చెందిన డి.బుజ్జిబాబుకు 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు, రూ.42 వేల ఫైన్ విధిస్తూ జడ్జి సిరిపిరెడ్డి సుమ తీర్పు చెప్పారు. 2024 మార్చి 30వ తేదీన నైట్ బుజ్జిబాబు బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడ్డాడు. విచారణలో నేరం రుజువు అయ్యింది.
News March 31, 2026
నెల్లూరు: APR 9న వైద్యారోగ్య శాఖ వాహనాల ఈ-వేలం

ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖకు చెందిన 19 పాత(ఖండించబడిన) వాహనాలకు ఏప్రిల్ 9న ఈ-వేలం నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ వి.సుజాత తెలిపారు. ఆసక్తి గలవారు https://konugolu.ap.gov.in పోర్టల్ ద్వారా వేలంలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. వేలానికి సంబంధించిన పూర్తి నిబంధనలు, షరతులు సదరు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె ఒక ప్రకటనలో కోరారు.
News March 31, 2026
లక్.. ప్రశాంతి రెడ్డికా లేక కోటంరెడ్డికా.?

మంత్రి పదవి రేసులో MLAలు ప్రశాంతి రెడ్డి, కోటంరెడ్డి ఉన్నారన్న చర్చ నడుస్తోంది. కోటంరెడ్డి మంత్రి పదవి ఆశతో YCP నుంచి TDP గూటికి చేరినా నిరాశ తప్పలేదు. ప్రశాంతిరెడ్డి సైతం YCP నుంచే TDPలోకి వచ్చారు. వీరిలో ఎవరికి మంత్రి పదవి వస్తుందన్న చర్చ జోరుగా నడుస్తోంది. మరోవైపు వీరికి మంత్రి పదవులు ఇస్తే TDPలో ఉన్న సీనియర్ MLAలు సీరియస్ అయ్యే అవకాశం ఉంది. దీంతో అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.?


