News March 4, 2025

దేశం కోసం ప్రకాశం జిల్లా వాసి ప్రయత్నం!

image

ఒక నినాదం కోసం వేల మైళ్లు సైకిల్ యాత్ర చేపట్టాడు ప్రకాశం జిల్లా వాసి. ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ అంటూ రుద్రవరం వాసి సుభాశ్ చంద్రబోస్ ప్రజలను చైతన్య పరుస్తున్నాడు. ఏకంగా 50 వేల కి.మీ యాత్రలో భాగంగా 28 రాష్ట్రాలను చుట్టేశాడు. 41,223 కి.మీ సైకిల్ తొక్కి విశాఖ చేరుకున్నాడు. పవన్ కళ్యాణ్‌ను కలిసి ఆయన చొరవతో రాష్ట్రపతికి ‘ఫ్యూచర్ ఆఫ్ ఇండియా’ డాక్యుమెంటరీ అందజేయడం తన లక్ష్యమంటున్నాడీ కుర్రాడు.

Similar News

News March 8, 2026

ప్రకాశంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుపై సమీక్ష

image

ప్రకాశం జిల్లా యువతకు నైపుణ్యాలు అందించేందుకు జిల్లాస్థాయిలో అడ్వాన్సుడ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నారు. సుంచూరియా యూనివర్సిటీతో కలిసి ఏర్పాటు చేయాలని, అడ్వాన్స్డ్ కోర్సులపై శనివారం ప్రకాశం భవన్‌లో కలెక్టర్ రాజాబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికార రవితేజ యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

News March 7, 2026

పెద్ద దోర్నాల వద్ద ప్రమాదం.. యువకుడు స్పాట్‌డెడ్

image

పెద్ద దోర్నాల మండలం చిన్న గుడిపాడు సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వెలుగొండ ప్రాజెక్టు వైపు వెళ్తున్న వింగర్ బొమ్మలపురం చెంచు కాలనీ వైపు వెళ్తున్న ఓ బైక్‌‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 7, 2026

10th పరీక్షల నిర్వహణపై కలెక్టర్, SP సమీక్ష

image

10వ తరగతి పరీక్షల నిర్వహణలోఎలాంటి లోపాలు లేకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టాలని శనివారం జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత శాఖల అధికారులతో ప్రకాశం భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లా SP హర్షవర్ధన్‌తో కలిసి జిల్లాలోని పరిస్థితిపై కలెక్టర్ సమీక్షించారు. 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలు జరుగుతాయని DEO తెలిపారు.