News March 4, 2025
సిద్దిపేట: గవర్నర్‌ను కలిసిన జిల్లా కలెక్టర్

హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ బుధవారం ఉదయం కుటుంబ సమేతంగా కొమురవెల్లి మల్లికార్జునస్వామి దర్శనానికి రాగా జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి, గజ్వేల్ ఆర్డీఓ చంద్రకళ వేరువేరుగా పుష్ప గుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అలాగే ప్రభుత్వ లాంఛనాల ప్రకారం పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. తదుపరి శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకుని పట్నం వేసి మొక్కులు తీర్చుకున్నారు.
Similar News
News November 9, 2025
అనకాపల్లి: సముద్ర తీర ప్రాంతాల్లో సందడి వాతావరణం

అనకాపల్లి జిల్లాలోని పలు సముద్ర తీర ప్రాంతాల్లో ఆదివారం సందడి వాతావరణం నెలకొంది. పరవాడ, అచ్యుతాపురం, ఎస్.రాయవరం, పాయకరావుపేట మండలాల్లోని ఉన్న తీరప్రాంతాలలో వేలాది మంది పర్యాటకులు సముద్ర స్నానాలు ఆచరించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి తీర ప్రాంతాలలో విహారయాత్ర చేపట్టి, ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. దీంతో పిక్నిక్ స్పాట్‌లు కళకళలాడాయి.
News November 9, 2025
‘మంత్రి కోమటిరెడ్డిని ఒక్కసారి చూడాలని ఉంది’

నల్గొండ జామ్‌మసీద్‌కు చెందిన పెరిక నాగార్జున బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వీరాభిమాని అయినా ఆయన ఆరోగ్యం విషమించి ప్రస్తుతం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన అభిమాన నాయకుడిని ఒక్కసారి చూడాలని నాగార్జున హృదయ విదారక విజ్ఞప్తి చేశాడు.
News November 9, 2025
MBNR: ఈనెల 12న అథ్లెటిక్స్ ఎంపికలు: శారదాబాయి

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14, 17 విభాగాల్లో బాల, బాలికలకు అథ్లెటిక్స్ ఎంపికలను నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. MBNRలోని డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 12న ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు ఒరిజినల్ బోనఫైడ్, ఆధార్ కార్డులతో ఉదయం 9:00 గంటలలోపు పీడీ ఆనంద్ కుమార్‌కి రిపోర్ట్ చేయాలన్నారు.


