News March 22, 2024
30న కడప జిల్లాలో చంద్రబాబు పర్యటన

కడప జిల్లాలో ఈ నెల 31 తేదీన చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. మైదుకూరు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో పర్యటించినట్లు టీడీపీ అధిష్ఠానం వెల్లడించింది. రానున్న ఎన్నికల నేపథ్యంలో 30వ తేదీన మైదుకూరులో ప్రజాగళం సమావేశంతో పాటు ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. జిల్లాలోని టీడీపీ శ్రేణులు పాల్గొని జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులు తెలిపారు.
Similar News
News April 9, 2025
పులివెందుల: MLC V/S మాజీ MLC

కడప జిల్లాలో TDPని బలోపేతం చేయాలనే ఆ పార్టీ పెద్దల ఆకాంక్ష.. స్థానిక నేతల వర్గపోరుతో తీరేలా కనిపించడం లేదు. ఈ మధ్య కాలంలో మాజీ MLC బీటెక్ రవి, MLC రాంగోపాల్ రెడ్డి వర్గీయుల మధ్య ఆధిపత్యం తారాస్థాయికి చేరుకుంది. ఇటీవల వీరి వర్గీయులు ఘర్షణలకు దిగారు. మంగళవారం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత ఎదుటే ఒకరిపై ఒకరు బాహాబాహికి దిగారు. దీంతో జిల్లా TDP సీనియర్ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
News April 8, 2025
ఒంటిమిట్ట: కళ్యాణోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో నిర్వహించబోయే కళ్యాణోత్సవం ఏర్పాట్లపై మంగళవారం మధ్యాహ్నం కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సమీక్ష సమావేశం నిర్వహించారు. కళ్యాణోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో ఎక్కడా ఇబ్బందులు జరగకుండా పటిష్టంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, ఎస్పీ అశోక్ కుమార్ పాల్గొన్నారు.
News April 8, 2025
అరటి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది: మంత్రి సవిత

ఇటీవల కురిసిన వర్షానికి అరటిపంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి సవిత పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో జేసీ అతిధి సింగ్తో కలిసి అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం అందించే విధంగా నివేదికలు తయారు చేయాలని సూచించారు.