News March 4, 2025
భూపాలపల్లి: ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. ఆయన పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు, పరీక్షా హాళ్ల పరిస్థితులు, విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలు, సీసీ కెమెరా పర్యవేక్షణ, మార్గదర్శకాల అమలును పరిశీలించారు. జిల్లాలో 3,615 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Similar News
News November 10, 2025
అభిషేక్ సరైన ఓపెనర్: పీటర్సన్

ఆస్ట్రేలియా టూర్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన భారత బ్యాటర్ అభిషేక్ శర్మపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ సోషల్ మీడియాలో ప్రశంసించారు. ‘టీ20 క్రికెట్‌కు అభిషేక్ సరైన ఓపెనర్. ధైర్యం, టాలెంట్ ఉన్న బ్యాటర్. ఆస్ట్రేలియా టూర్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు’ అని పొగిడారు. 163 రన్స్‌తో ఆసీస్ టూర్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా అభిషేక్ నిలిచిన సంగతి తెలిసిందే.
News November 10, 2025
టెన్త్ విద్యార్థులకు ‘మోదీ గిఫ్ట్’.. ఫీజు చెల్లించిన బండి

కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్.. తన నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అండగా నిలిచారు. జిల్లాలోని 4,847 మంది పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజును ఆయన తన జీతం నుంచి చెల్లించారు. రూ. 5,45,375 విలువైన చెక్కును కరీంనగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగా కృష్ణారెడ్డి ద్వారా కలెక్టర్‌కు అందజేశారు. ఈ మొత్తాన్ని ఆయన ‘మోదీ గిఫ్ట్’ పేరుతో చెల్లించారు.
News November 10, 2025
నిర్మల్ వాసికి ఐరన్ మ్యాన్ టైటిల్

నిర్మల్ పట్టణానికి చెందిన వైద్యుడు డా. బీఎల్ నరసింహారెడ్డి అరుదైన ఘనత సాధించారు. గోవాలో నిర్వహించిన అంతర్జాతీయ పోటీలో 64 దేశాల అభ్యర్థులతో పోటీ పడి ఐరన్ మ్యాన్ టైటిల్‌ను గెలుచుకున్నారు. 2 కి.మీ. ఈత, 21 కి.మీ. పరుగు, 90 కి.మీ. సైక్లింగ్‌తో కూడిన ఈ పోటీలో ఆయన విజేతగా నిలిచారు. దాదాపు ఆరు నెలల నిరంతర శ్రమతోనే ఇది సాధ్యమైందని ఆయన తెలిపారు. పలువురు పట్టణ ప్రజలు నరసింహారెడ్డిని అభినందించారు.


