News March 4, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

➤ అల్లూరి: వాట్సాప్ ద్వారా 10వ తరగతి హాల్ టిక్కెట్లు
➤ గంగవరం: అల్లూరి జిల్లాలో లక్ష్యానికి మించి పనిదినాలు
➤ ఢిల్లీ వెళ్లిన అల్లూరి జిల్లా కలెక్టర్
చింతపల్లి: సచివాలయంలో యువకుడు హల్చల్
➤ రంపచోడవరం పాఠశాలలపై మంత్రి కీలక ప్రకటన
➤హైవే అధికారులపై పాడేరు ఎమ్మెల్యే ఆగ్రహం
➤ పెదబయలు హౌసింగ్ ఏఈపై విచారణ జరిపించాలి: బీజేవైఎ
➤పాడేరు కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం: ఆశాలు
Similar News
News March 5, 2025
మెదక్: ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్‌పై నిషేధం

మెదక్ జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం విధిస్తున్నట్లు మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. పర్యావరణ రక్షణ చట్టం 1986 లోని సెక్షన్ 5 కింద ఆదేశాలు జారీ చేసినట్లు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. కావున అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మంచినీరు తాగేందుకు స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్ ఉపయోగించాలని సూచించారు.
News March 5, 2025
ADB: పరీక్ష కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు

ఇంటర్ పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాలలో 163 బీఎన్ఎస్ఎస్ సెక్షన్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ గౌస్ ఆలం పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వెలుపల ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది బందోబస్తులో ఉంటారని తెలియజేశారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను మూసి ఉంచాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. అదేవిధంగా పరీక్ష కేంద్రాలలోనికి సెల్‌ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదన్నారు.
News March 5, 2025
సంగారెడ్డి: ‘గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి’

జిల్లాలో నేటి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రామ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు.